Don't Miss!
- News
మరోసారి భగ్గుమన్న తాడిపత్రి
- Finance
Bank Strike: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ఆ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయి..!
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
‘మా’ను నాశనం చేయడానికే ఉన్నావా? నీవల్లనే సంస్థ డబ్బులు పోయాయి.. నరేష్‌పై శ్రీకాంత్ ఆగ్రహం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గందరగోళంగా మారాయి. ప్రకాశ్ రాజ్, విష్ణు మంచు ప్యానెల్స్ మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ప్రకాశ్ రాజ్, విష్ణు మంచు ఒకరినొకరు చేసుకొనే విమర్శలు పక్కన పెడితే.. తాజాగా వీకే నరేష్ చేసిన ఆరోపణలపై నటుడు శ్రీకాంత్ భగ్గుమన్నారు. ఎన్నికలకు కొద్ది గంటల ముందు నరేష్, శ్రీకాంత్ వీడియోలు విడుదల చేయడం చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

దుర్వార్త అందిందని అంటూ..
నరేష్ విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ.. ఇప్పుడే అందిన దుర్వార్త ఏమిటంటే... ప్రత్యర్థి వర్గాలు ఓట్ల కోసం డబ్బులు పంచుతున్నారు. 10 వేల నుంచి 25 వేల రూపాయలను ఇచ్చేందుకు బేరం ఆడుతున్నారు. ఓటు వేసే వ్యక్తిని బట్టి మూడు నాలుగు సెంటర్లలో డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం వచ్చింది. అందుకే వాళ్లు మ్యానిఫెస్ట్ రిలీజ్ చేయకుండా డబ్బు బలంతో గెలిచేందుకు కుట్రలు పన్నుతున్నారు. కరోనా సమయంలో నేను డబ్బులు పంచితే నాపై నానా రకాలుగా కామెంట్ చేశారు అని వీకే నరేష్ ఆరోపించారు.

డబ్బులు పంచితే తీసుకోండి అంటూ నరేష్
విష్ణు మంచు ప్యానెల్ ప్రత్యర్థులు డబ్బులు పంచితే తీసుకోండి. వారి నుంచి ఒక్కపైసా కూడా రాదు. నేను ఆర్టిస్టులు ఇబ్బందుల్లో ఉంటే డబ్బు ఇస్తే నాపై దారుణంగా విమర్శలు చేశారు. కాబట్టి డబ్బులు ఇస్తే తీసుకోండి. మీ మనసాక్షికి తగినట్టు ఓట్లు వేయండి. విష్ణు మంచుకు ఓటు వేయమని చెబుతాను. ఈ ఎన్నికల్లో ఇదే చివరి వీడియో. అంతకంటే ఎక్కువ కోరను. అందరం కలుసుకొందాం ఓటు వేద్దాం. నేను అబద్దాలు చెప్పను. నాకు వచ్చిన సమాచారం చెబుతున్నాను అని వీకే నరేష్ అన్నారు.

మేము డబ్బులు పంచుతున్నామా?
నరేష్
విడుదల
చేసిన
వీడియోపై
నటుడు
శ్రీకాంత్
ఘాటుగా
స్పందించారు.
నరేష్
గారు..
మేము
డబ్బులు
పంచుతున్నామా?
ఎందుకు
అబద్దాలు
ఆడుతున్నారు?
మూడు
మూడు
సెంటర్లలో
డబ్బులు
పంచుతున్నామా?
మీరు
ఎవరితోనో
డబ్బులు
పంపించి
ప్రకాశ్
రాజ్
ఇస్తున్నాడని
చెబుతున్నారా?
ఇక
ఇక్కడితో
ఆపేయండి.
ఇక
ఎక్కువ
తక్కువ
మాట్లాడవద్దు.
నరేష్
వాళ్లు
చేసే
పనిని
మాపై
రుద్దేందుకు
ప్రయత్నిస్తున్నాడు
అని
శ్రీకాంత్
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.

అమ్మవారే శిక్షిస్తుంది అంటూ శ్రీకాంత్
నరేష్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మేము తప్పు చేస్తే అమ్మవారే శిక్షిస్తారు. మీరు ఇంకా మాపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారా? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను నాశనం చేసేందుకే ఉన్నారా? ఆలోచించి మాట్లాడండి.. కొంచెం మైండ్ పెట్టి మాట్లాడండి. డబ్బులు పంచేది మీరు. మా డబ్బులు అన్నీ దొబ్బాయి. మీరు ఎవరి ద్వారానో పంచేందుకు ప్రయత్నిస్తూ.. ఎవరైనా పట్టుకొంటే ప్రకాశ్ రాజ్ ఇస్తున్నాడని తప్పుడు సమాచారం ఇస్తున్నారా?

నీ వల్లే డబ్బులు మొత్తం పోయాయి అంటూ శ్రీకాంత్
రేపు
ఎలక్షన్స్
పెట్టుకొని
డబ్బులు
పాంచుతున్నామని
చెపుతారా?
డబ్బులు
పెంచుతున్నది
మీరు.
నీ
వల్లనే
అసోసియేషన్
డబ్బులు
మొత్తం
పోయాయి.
దయచేసి
మా
సభ్యులు
ఇలాంటి
ప్రలోభాలకు
లొంగవద్దు.
మనసాక్షిగా
ఓటు
వేయండి
అంటూ
శ్రీకాంత్
ఘాటుగా
స్పందించారు.
అక్టోబర్
10
ఉదయం
మా
కార్యవర్గం
ఎంపిక
కోసం
ఎన్నికలు
జరుగనున్నాయి.