Just In
Don't Miss!
- News
నిమ్మగడ్డ సంచలనం: ఇద్దరు కలెక్టర్లు సహా 9మందిపై వేటుకు ఆదేశం -ఎన్నికలకు అడ్డొస్తే అంతే!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరో రాజశేఖర్ కారణంగా సాయి కుమార్‌తో గొడవ.. క్లారిటీ ఇచ్చిన సుమన్
సీనియర్ నటులు అప్పట్లో ఎంతటి క్రమశిక్షణతో మెలిగినప్పటికి కొంతమంది స్టార్స్ మధ్య మాత్రం మనస్పర్థలు ఉండేవని వార్తలు గట్టిగానే వచ్చేవి. అయితే ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా స్టార్స్ మాత్రం పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇక తెర వెనుక జరిగే మనస్పర్థల గురించి అలాగే గొడవల గురించి చాలా సందర్భాల్లో కొంతమంది సీనియర్ నటులు స్పందించారు. ఇక తన పాత్రకు డబ్బింగ్ చెప్పే సాయి కుమార్ తో కూడా సుమన్ గొడవ పెట్టుకున్నట్లు అప్పట్లో టాక్ బాగానే వచ్చింది. ఇక ఇటీవల సుమన్ ఆ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చాడు.

కేవలం హీరోగానే కాకుండా..
సీనియర్ నటుడు సుమన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా చెరగని ముద్ర వేసుకున్నాడు. అతను నటించిన కొన్ని సినిమాలో అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళను అందుకున్నాయి. కేవలం హీరోగానే కాకుండా మార్కెట్ తగ్గిన అనంతరం సహా నటుడిగా కూడా క్రేజ్ అందుకున్నాడు. అన్నమయ్య సినిమాలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా కనిపించి ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

సాయి కుమార్ తో గొడవ
ఇక శివాజీ వంటి సినిమాలో విలన్ గా చేసి నటనతో సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేశారు. అయితే ఇటీవల అలీతో సరదాగా ఇంటర్వ్యూలో సుమన్ ఒక విషయంలో క్లారిటీ ఇచ్చాడు. కెరీర్ మొదట్లో చాలా వరకు సుమన్ పాత్రలకు సాయి కుమార్ డబ్బింగ్ చెప్పేవారు. అయితే కెరీర్ ఊపందుకున్న సమయంలో రాజశేఖర్ కారణంగా వారిద్దరికీ గొడవ జరిగినట్లు రూమర్స్ బాగానే వచ్చాయి.

రాజశేఖర్ కు డబ్బింగ్ చెప్పడం వలన
రాజశేఖర్, సుమన్ ఇద్దరికి కూడా పడదని అప్పట్లో మీడియాలలో అనేక రకాల కథనాలు వచ్చాయి. ఆ రూమర్స్ సంగతి పక్కన పెడితే సాయి కుమార్ గతంలో అలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ కు ఒక విషయంలో తాను నచ్చేవాడిని కాదని చెప్పాడు. అందుకు కారణం రాజశేఖర్, సుమన్ కు నేనే డబ్బింగ్ చెప్పడం పలు చర్చలకు దారి తీసిందని చెప్పారు. అదే తరహాలో రాజశేఖర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసేవారట.

క్లారిటీ ఇచ్చిన సుమన్
ఇక గొడవ జరిగిందనే రూమర్స్ పై స్పందించిన సుమన్ అలాంటిదేమి లేదని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. నిజానికి నాకు ఒక విధంగా లైఫ్ ఇచ్చింది సాయి కుమార్ మాత్రమే. అలాంటిది అతనితో గొడవ అనేది ఎప్పుడు జరగలేదు. ఒకరికి డబ్బింగ్ చెప్పవద్దని నేను ఎప్పుడు అనలేదు. కాకపోతే ఒక చిన్న సలహా మాత్రం ఇచ్చాను. ఒక స్థాయి నటులకు డబ్బింగ్ చెప్పి నీ స్థాయి తగ్గించుకోకు అని చిన్న సలహా నవ్వుకుంటూ ఇచ్చాను. అయిన అది సాయి ఇష్టం. సరదాగా సలహా ఇచ్చాను అంతేగాని గొడవ అయితే పడలేదు అంటూ సుమన్ వివరణ ఇచ్చారు.