Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
తొలిసారి తండ్రినయ్యాను.. చేసింది ఎవరంటే.. నటుడు ఉత్తేజ్!
Recommended Video

లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకంపై సతీష్ చంద్ర నాదెళ్ళ దర్శకత్వంలో శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా లక్ష్మణ్ క్యాదరి నిర్మిస్తున్న చిత్రం 'వినరా సోదర వీరకుమారా!'. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో మంగళవారం (ఫిబ్రవరి25)న జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెక్కెం వేణుగోపాల్ హాజరయ్యారు. ఇంకా ఈ చిత్రంలో నటించిన ప్రియాంక జైన్, ఉత్తేజ్, మాస్టర్ రోషన్, దర్శకులు సతీష్ చంద్ర నాదెళ్ల, నిర్మాత లక్షణ్, మాటల రచయిత లక్ష్మీ భూపాల్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉత్తేజ్ మాట్లాడుతూ..

బెస్ట్ డైరెక్టర్ అవ్వడం ఖాయమని
ప్రతీ సినిమా ఆరంభించే ముందు కొత్త కథ, డిఫరెంట్ అని చెప్పుకోవడం చాలా సహజం. నేను ఇప్పటి నేను రచయితగా, నటుడిగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో డైరెక్టర్‌గా దాదాపు సినీ పరిశ్రమలో 28 ఏళ్లుగా పనిచేశాను. ఇంత అనుభవం ఉన్న నేను సవాల్ చేసి చెబుతున్నాను. ఈ సినిమా దర్శకుడు సతీష్ ఇండస్ట్రీలో బెస్ట్ డైరెక్టర్ అవుతాడు అని నటుడు ఉత్తేజ్ అన్నారు.

చిన్నపాపలా ప్రేమిస్తాడు
దర్శకుడు సతీష్ సినిమాను బాగా ప్రేమిస్తాడు. ప్రతీ ఫ్రేమ్‌ను చిన్నపాపలా ప్రేమిస్తాడు. తల్లి, తండ్రి తర్వాత అంతగా ప్రేమించేది సినిమానే. ఈ సినిమాకు రచయిత లక్ష్మీభూపాల్ దొరకడం అదృష్టం. లక్ష్మీభూపాల్ మాటలు, పాటలు అద్భుతంగా ఉంటాయి. సినిమాటోగ్రఫి బాగుంటుంది.

ఎమోషనల్‌గా ప్రేమకథ
వినరా సోదర వీర కుమారా చిత్రం అద్భుతమైన ఎమోషనల్‌గా సాగుతుంది. ప్రతీ అబ్బాయి, అమ్మాయి, తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇది. జీవితంలో తల్లిదండ్రులు, టీచర్లు, సమాజం భాగమవుతారు. వాళ్లందరి కాదనుకొని ఎదీ పట్టించుకోకుండా ఓ లక్ష్యం కోసం వెళ్తుంటాం. కానీ లక్ష్యానికి చేరువైన తర్వాత జీవితంలో వెనుకకు తిరిగి చూసుకొంటే అంతా కోల్పోతాం. అలాంటి ఎమోషనల్ ప్రేమ కథను చెప్పే చిత్రమే ఈ సినిమా.
మొదటిసారి తండ్రిపాత్రలో
వినరా సోదర వీర కుమారా చిత్రంలో చిన్న పాత్ర పోషించిన ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర చేశాను. తొలిసారి నేను ఈ సినిమాలో తండ్రినయ్యాను. అంటే తండ్రి పాత్రలో నటిస్తున్నాను. తండ్రి పాత్రను పోషించడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు రకరకాల పాత్రలను ధరించాను. కానీ దర్శకులు సతీష్ నన్ను తొలిసారి తండ్రి పాత్రలో నటింపజేశాడు. అని ఉత్తేజ్ ఉద్వేగంతో ప్రసంగించారు.

వినరా సోదరా వీరకుమారా ట్రైలర్ గురించి
వినర సోదరా వీరకుమారా చిత్రం ట్రైలర్‌లో ఉద్వేగభరిత సన్నివేశాలు కనిపించాయి. హీరో, హీరోయిన్ల ఫెర్ఫార్మెన్స్, మాటలు ఎమోషనల్‌గా కనిపించాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. కాకినాడ పట్టణం నేపథ్యంగా చిత్రీకరించిన సినిమాలో కొత్తదనం కనిపించింది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది.