For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  MAA Elections : ఏకమైన ఇండస్ట్రీ..హేమకి షాక్.. నోటీసులు కూడా జారీ?

  |

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంబంధించిన ఎన్నికల వ్యవహారం రోజురోజుకు అనేక మలుపులు తిరగడం ఆసక్తికరంగా మారుతోంది. అసలు ఎన్నికలు అనేవి ప్రకటించకుండానే అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని ప్రకటించిన అభ్యర్థులు ఒకరి మీద ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటూ పరువు తీస్తున్నారని సినీ పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రస్తుతం అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నరేష్ కు వ్యతిరేకంగా నరేష్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ సినీ నటి హేమ కొంత మంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు వాయిస్ మెసేజ్ పంపిన విషయం టాలీవుడ్ లో కలకలం రేపింది.. అంతేకాక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేస్తూ కూర్చుని నిధులను ఖర్చు పెడుతున్నారని ఆమె ఆరోపించింది. అందుకే ప్రస్తుతం అసోసియేషన్ ను రద్దు చేసి వెంటనే ఎన్నికలు జరపాలని కోరుతూ లేఖలు సిద్ధం చేస్తూ ఉండటం సంచలనం రేపింది. ఈ అంశం మీద నరేష్ జీవిత రాజశేఖర్ ఇద్దరు నిన్న ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి హేమ మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండించారు.

  అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా హేమ మాట్లాడుతున్నారని పేర్కొంటూ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు కూడా చేస్తామని వెల్లడించారు. ఇక నరేష్ మీటింగ్ లో సినీ ఇండస్ట్రీ మొత్తం తమ వెనుక ఉన్నారు అన్నట్లు మాట్లాడుతూ ఉండడం గమనార్హం. ఈ రోజు ఆయన అన్నట్లుగానే క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేయడం ఆ వెంటనే హేమకు క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేయడం కూడా జరిగిపోయాయి. నిజానికి నిన్ననే మా వ్యవస్థాపక అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వెంటనే జరపాలని క్రమశిక్షణా సంఘం చైర్మన్ కృష్ణంరాజు కు లేఖ రాశారు. "మా" ప్రతిష్ట మసకబరుస్తున్న వారిపై చర్యలు తీసుకోవడానికి ఉపేక్షించవద్దంటూ కృష్ణంరాజుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కమిటీ పదవీ బాధ్యతలు ముగిశాయని, వివాదాలకు చెక్ పెట్టాలంటే వెంటనే "మా" ఎన్నికలు ఏర్పాటు చేసి కొత్త కమిటీని నియమించాలని ఆయన కోరారు.

  Actress Hema Gets show cause Notices From Maa Disciplinary Committee

  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవడంతో "మా" సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇక కొంతమంది సభ్యులు బహిరంగంగా చేస్తున్న ప్రకటనలు వల్ల ప్రతిష్ఠాత్మకమైన "మా"కు చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "మా" నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని, వెంటనే "మా' ఎన్నికలు జరపాలంటూ క్రమశిక్షణ సంఘానికి పంపిన లేఖలపై సంతకాలు చేయాలని మా సభ్యులందరినీ కోరుతూ హేమ ఒక వాయిస్ మెసేజ్ పంపింది. ఈ అంశం ఈ నేపథ్యంలో "మా" ఎన్నికల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటున్న అనేది ఆసక్తికరంగా మారింది. ఇక మరో పక్క మంచు విష్ణు అయితే ఇంకా ఎలాంటి వివాదంలోకి దిగలేదు. ఇక ప్రకాష్ రాజ్ కి గాయాలు కావడంతో ఆయన చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్నారు. ఇక రానున్న మరికొద్ది రోజుల్లో మళ్ళీ మా ఎన్నికలు వార్తల్లోకి ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

  Read more about: actress hema హేమ
  English summary
  Maa Disciplinary Committee gave notices to Actress Hema. about her recent voice clip to MAA members.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X