For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ హీరోతో అఫైర్, ఏకంగా ఉంచుకున్నారని.. తప్పేమీ లేదంటూ సీక్రెట్స్ పంచుకున్న కస్తూరి!

  |

  తెలుగు హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించిన కస్తూరి ఇప్పుడు సినిమాలకు దూరమై సీరియల్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తనకు అఫైర్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  అద్భుతమైన పాత్రలు

  అద్భుతమైన పాత్రలు

  చదువుకునే రోజుల్లోనే మిస్ చెన్నై గా ఎన్నికైన కస్తూరి ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేసింది. సుమారు 20 ఏళ్ల క్రితమే ఆమె తమిళ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఒక ఏడాది లేట్ గా ఎంట్రీ ఇచ్చినా అటు తమిళ ఇటు తెలుగు బాషలలో కూడా ఆమె నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు.. తెలుగులో గ్యాంగ్ వార్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత నిప్పురవ్వ, గాడ్ ఫాదర్, సోగ్గాడి పెళ్ళాం, మెరుపు, చిలక్కొట్టుడు, రథయాత్ర, అన్నమయ్య, మా ఆయన బంగారం, గుడుగుడు గుంజం, డాన్ శీను వంటి అనేక సినిమాల్లో నటిగా మెప్పించారు.

  బిగ్ బాస్ తో

  బిగ్ బాస్ తో

  అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉండగా ఆమె వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత సుమారు ఏళ్ల పాటు ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. తర్వాత మళ్ళీ తమిళ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి తమిళ, తెలుగు భాషలలో చాలా సినిమాల్లో నటించారు. ఇక నిజానికి ముందు నుంచి కూడా అటు తెలుగు ఇటు తమిళ సీరియల్స్ లో నటించడం ఆనవాయితీగా వస్తోంది. అలా ఆమె ప్రస్తుతం తెలుగులో ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్ చేస్తున్నారు. అలాగే తమిళంలో అగ్ని నక్షత్రం సీరియల్ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2019 లో జరిగిన తమిళ బిగ్ బాస్ 3 సీజన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు అరవై మూడు రోజుల పాటు హౌస్ లో నిలబడి ఆమె ఇతర కంటెస్టెంట్స్ కి గట్టిగా పోటీ ఇచ్చారు

  డైమెండ్ నెక్లెస్

  డైమెండ్ నెక్లెస్

  తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన జీవితంలో నవ్వుకున్న గాసిప్స్ గురించి అలాగే బాధపడిన విషయాల గురించి కూడా చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో తాను ఒక హీరోతో మూడు సినిమాలు వరుసగా నటిస్తే ఆయన తనకు ఒక డైమండ్ నెక్లెస్ కొనిచ్చాడు అని వార్తలు రాశారు అని ఆమె చెప్పుకొచ్చారు. అందుకే అప్పటి నుంచి ఆ హీరో ని కలిస్తే నా డైమండ్ నెక్లెస్ ఎక్కడ ఉంది ఇప్పటికైనా కొనివ్వచ్చు కదా వాళ్ళు రాసిన వార్తలు నిజం చేయొచ్చు కదా అని అడుగుతూ ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే డైమండ్ నెక్లెస్ ఇచ్చారనే మాట రాశారు గాని ఎందుకు ఇచ్చారు దానికి ఏం చేశారు అనే విషయాలు మాత్రం రాయ లేదని ఆమె చెప్పుకొచ్చారు.

  అంత పెద్దాయనతో

  అంత పెద్దాయనతో

  మరో దారుణమైన విషయం ఏమిటంటే తమిళనాడుకు చెందిన ఒక బిగ్ షాట్ తమిళనాడు వ్యాప్తంగా ఫేమస్ అయిన బిజినెస్ మేన్ నన్ని ఉంచుకున్నాడు అని రాశారు అని. ఇది తనను ఎంతో బాధించిందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే తన తండ్రి మాత్రం పత్రికాముఖంగా ఈ వార్తలు రాసే వారిని పిలిచి రాసేది ఎలాగో రాశారు బ్రిటిష్ బిజినెస్ మేన్ తో అఫైర్ ఉందని రాస్తే బాగుండేది కదా ఇలా లోకల్ బిజినెస్ మేన్ తో ఎందుకు అని సరదాగా వ్యాఖ్యానించారని ఆమె చెప్పుకొచ్చారు.. అయితే నిజానికి తాను ఆ బిజినెస్ మాన్ ముఖం కూడా చూసి ఉండలేదని ఆమె వెల్లడించారు.

  ముఖం మీదే అడిగేశా

  ముఖం మీదే అడిగేశా

  అయితే ఫేమస్ బిజినెస్ మాన్ కావడంతో ఆయన గురించి వార్తలు తెలుసేమో అని చెప్పుకొచ్చారు. అప్పుడు తన వయసు 20 ఏళ్లుగా కాగా ఆ బిజినెస్ మాన్ వయసు అప్పటికే ఆ 60 ఏళ్లు ఉండేవని చెప్పుకొచ్చారు. ఇక ఆయనను కలిసే అవకాశం మొన్నీమధ్య దొరికిందని దొరికితే నేరుగా వెళ్లి మీకు తెలుసా మనిద్దరికీ ఒక లింకు పెట్టి మీడియా వాళ్లు వార్తలు రాశారు దానివల్ల నేను ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ముఖం మీద అడిగేశా అని ఆమె వెల్లడించారు. అయితే ఆ తరువాతి రోజు పోలీసు అధికారులు ఫోన్ చేసి అలా ఎందుకు అడిగారు అని ప్రశ్నించారని కస్తూరి చెప్పుకొచ్చారు..

  Bigg Boss Tamil Contestent Madhumitha Confirms Police Complaint Against Her By The Channel
  అలా రాయడం తప్పేమీ కాదే

  అలా రాయడం తప్పేమీ కాదే

  అయితే మీడియా వాళ్లు ఇలా తమ వార్తలను జనానికి అమ్ముకునేందుకు రాస్తూ ఉంటారని అందులో తప్పేమీ లేదని ఆమె అన్నారు.. తాను ప్రతి శనివారం గుడికి వెళుతుంటే కస్తూరి గుడి కి వెళ్ళింది అంటే ఎవరు చదవరని, అయితే ప్రతి శనివారం కస్తూరి అక్కడికి ఎందుకు వెళుతోంది ? అని హెడ్డింగ్ పెడితే అప్పుడు చదువుతారని జనం కోసమే ఇలా చేస్తున్నారని కూడా ఆమె వెల్లడించారు. ఇక కస్తూరి రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ లేకపోయినా ఆమె బిజెపిలో చేరవచ్చని గతంలో ప్రచారం జరిగింది అయితే తాను ఏ పార్టీలోనూ చేరను అని ఆమె క్లారిటీ ఇచ్చారు కూడా.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  It is known that Kasturi, who has acted in many movies as a Telugu heroine, is now moved away from movies and acting in serials. However, in a recent interview to a YouTube channel, she made sensational comments about her affairs.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X