Just In
- 46 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 1 hr ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 2 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
Corona Vaccine: మీ వ్యాక్సిన్ పై ప్రజలకు నమ్మకం ఉందా ?, అమ్మ పెట్టదు, అడుక్కుతిన్నీయ్యదు, ఇదే !
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గోవాలో రోజా ఎంజాయ్.. అందుకోసమేనా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్
న్యూ ఇయర్ సందర్బంగా అంతా ఎంజాయ్ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఫారెన్ టూర్స్ వేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే మహేష్ బాబు, రాజశేఖర్ కూతుళ్లు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలెట్టిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా కూడా కొత్త సంవత్సరాన్ని ఎంజాయ్ చేస్తోంది.

రోజా గోవా టూర్..
ఈ మేరకు తన కుటుంబ సభ్యులతో కలిసి గోవా టూర్ వేసింది రోజా. అక్కడి అందమైన ప్రదేశాల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తోంది ఈ సీనియర్ హీరోయిన్.
ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించిన రోజా ఎయిర్ పోర్టు, గోవాలో తీసుకున్న సెల్ఫీ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

అక్కడే ప్లాన్ చేసిన రోజా
ఈ ఫొటోల్లో రోజాతో పాటు ఆమె పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కనిపిస్తున్నారు. ఈ శీతాకాలంలో గోవా టూర్‌కు వెళుతున్నట్టు రోజా ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకలను అక్కడ ప్లాన్ చేసిందని సమాచారం. కొత్త సంవత్సరం మొదటి రోజును తన ఫ్యామిలీతో గోవాలోనే జరుపుకునే విధంగా స్కెచ్ వేసిందట రోజా.

రోజాకు అలవాటే..
ఇలా కుటుంబంతో కలిసి విహార యాత్రల్లో ఎంజాయ్ చేయడం, సరదాగా గడపడం రోజాకు అలవాటే. ఇప్పటికే ఇలాంటి ఫ్యామిలీ వెకేషన్స్ వేసి విదేశాలకు కూడా వెళ్ళొచ్చింది రోజా. ప్రస్తుతం రోజా గోవా టూర్ తాలూకు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రోజా జబర్దస్త్ కామెడీ
ఇక బుల్లితెరపై తనదైన స్టైల్‌లో జబర్దస్త్ కామెడీ వేదికపై రోజా సందడి చేస్తూ వస్తోంది. ఇటీవలే ఈ షో నుంచి మెగా బ్రదర్ నాగబాబు తప్పుకున్నప్పటికీ రోజా సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తూ మరింత పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే మరోవైపు రాజకీయాల్లో కూడా తన మార్క్ చూపిస్తూ వస్తోంది రోజా.

రోజా గోవా ట్రిప్.. అందుకోసమేనా?
ఒకరకంగా చెప్పాలంటే 2019 సంవత్సరం రోజాకు బాగా కలిసొచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె.. ఆ తర్వాత క్యాబినేట్ ర్యాంకుతో సమానమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి దక్కించుకుంది. జబర్దస్త్ తెరపై కిక్కిస్తూనే ఉంది. ఈ జోష్ లోనే రోజా గోవా ట్రిప్ వేసిందని టాక్ నడుస్తోంది.