బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన ఆదిపురుష్... రిలీజ్ అవ్వకముందే మూడింతలు ఎక్కువగా..
టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బహుబలి నేషనల్ మార్కెట్ పై ఒక అవగాహన తీసుకోచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా హిట్టవ్వడంతో మరిన్ని పెద్ద సినిమాలకు ఒక రూట్ అయితే దొరికింది. ఇక ఆ స్థాయిలో రికార్డును బ్రేక్ చేసే సినిమా మరొకటి ఇంతవరకు రాలేదు. రానున్న రోజుల్లో RRR తో పాటు ఇతర సినిమాలు కూడా బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తాయని ఒక నమ్మకం అయితే ఉంది. ఇక ఒక విషయంలో ఆదిపురుష్ రిలీజ్ కాకముందే బాహుబలి రికార్డును బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది.

ఆ రికార్డును బ్రేక్ చేసేది ఎవరు?
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలిపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రభాస్ కెరీర్ లోనే నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందించి నెంబర్ వన్ పాన్ ఇండియా స్థానానికి చేర్చింది. ఇక ఆ సినిమా స్థాయిలో మళ్ళీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా రికార్డు బ్రేక్ చేస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు.

RRR సిద్ధంగా ఉంది
బాక్సాఫీస్ పరంగా ప్రస్తుతం అయితే అందరి చూపు RRR పైనే ఉంది. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ పై ప్రస్తుతం అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే 900కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు టాక్ అయితే వస్తోంది. ఇక బహుబలి రికార్డులు బ్రేక్ అవ్వడం కాయంగా కనిపిస్తోంది.

బాహుబలి కంటే ఎక్కువగా ఆదిపురుష్ VFX షాట్స్
అయితే ఒక విషయంలో ఆదిపురుష్ సినిమా బాహుబలి రికార్డును బ్రేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ఓం రావత్ ఈ సినిమాను పూర్తిగా 3డి ఫార్మాట్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలో బాహుబలి కంటే ఎక్కువగా VFX షాట్స్ ను షూట్ చేయబోతున్నట్లు సమాచారం.

మూడింతలు ఎక్కువగా?
బాహుబలి కోసం మొత్తంగా 2500 VFX షాట్స్ అవసరం పడగా ఇప్పుడు ఆదిపురుష్ షూటింగ్ మొత్తం దాదాపు గ్రాఫిక్స్ తోనే తెరకెక్కుతోంది కాబట్టి దాని కంటే మూడింతలు ఎక్కువగా 8000 VFX షాట్స్ అవసరం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఇప్పటివరకు ఈ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ను ఏ సినిమాకు ఉపయోగించలేదు. ఆ విధంగా బాహుబలి రికార్డును బ్రేక్ చేస్తున్న ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు బ్రేక్ చేస్తూందో చూడాలి.


Click it and Unblock the Notifications











