For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HIT 2: నెల వ్యవధిలో రెండు సినిమాలు.. లుక్‌తో అంచనాలు పెంచిన అడివి శేష్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన టాలెంట్లతో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే విలక్షణ నటనతో విశేషమైన గుర్తింపును అందుకున్నారు. అందులో టాలెంటెడ్ యంగ్ హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విలన్ పాత్రలతో కెరీర్‌ను ఆరంభించిన అతడు.. ఆ తర్వాత సోలో హీరోగా మారిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సినిమా సినిమాకూ వేరియేషన్ చూపిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో అడవి శేష్ వరుసగా హిట్లు మీద హిట్లను సొంతం చేసుకుంటున్నాడు. ఫలితంగా రెట్టించిన ఉత్సాహంతో కొత్త ప్రాజెక్టులను మొదలు పెడుతున్నాడు.

  Bigg Boss Non Stop: నీ బటన్స్ తీసి బ్రా చూపించు.. ఆమెతో శివ అసభ్యంగా.. నాగార్జున వీడియో చూపించడంతో!

  వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న యంగ్ స్టార్ హీరో అడవి శేష్ ప్రస్తుతం శశి కిరణ్ తిక్క తెరకెక్కిస్తోన్న 'మేజర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమా రేంజ్‌ను మరింతగా పెంచేశాయి. ఫలితంగా ఈ మూవీ దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ చిత్రం జూన్ 3వ తేదీన విడుదల కాబోతుంది.

  Adivi Sesh HIT 2 First Look and Release Date Announced

  'మేజర్' మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే అడివి శేష్ మరో ప్రాజెక్టును కూడా మొదలెట్టాడు. రెండేళ్ల క్రితం చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న 'హిట్'కు ఇది సీక్వెల్‌గా రాబోతుంది. మొదటి భాగంలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. ఇందులో శేష్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. 'హిట్ ద సెకెండ్ కేస్' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీని కూడా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. శేష్ ఒకవైపు మేజర్ మూవీ షూట్‌లో పాల్గొంటూనే.. మరోవైపు ఇందులో కూడా భాగం అవుతున్నాడు. ఇలా ఈ సినిమాను చాలా వరకూ పూర్తి చేసుకున్నాడు.

  Adivi Sesh HIT 2 First Look and Release Date Announced

  టాప్‌ను పైకి లేపి షాకిచ్చిన హీరోయిన్: ప్రైవేట్ భాగాలు కనిపించేలా తెలుగు నటి సెల్ఫీ వీడియో

  ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా వచ్చిన 'హిట్' మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు దాదాపు రూ. 7.50 కోట్ల రాబట్టింది. దీంతో ఇప్పుడు అడివి శేష్ హీరోగా నటిస్తోన్న 'హిట్ ద సెకెండ్ కేస్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే చిత్ర యూనిట్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది. ఇక, ఈ సినిమాను జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. అలాగే, ఓ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడదలు చేసింది. ఇందులో అడివి శేష్ పవర్ ఫుల్ కాప్‌ లుక్‌తో కనిపించాడు. దీంతో అంచనాలన్నీ రెట్టింపు అయిపోయాయి.

  క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'హిట్ ద సెకెండ్ కేస్' మూవీని శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక గా నటిస్తుంది. రావు రమేష్, భాను చందర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. జాన్ స్టీవర్ట్ ఎడూరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

  English summary
  Tollywood Young Hero Adivi Sesh Now Doing HIT The Second Case Movie Under Sailesh Kolanu Direction. Now This Movie First Look and Release Date Announced.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X