RGV దర్శకుడిగా ఆర్జీవి శిష్యుడు.. అడివి శేష్ చేతుల మీదుగా ఎంతవారుగాని టీజర్

తెలుగు సినిమా పరిశ్రమలో నివాస్ పరిచయం అక్కర్లేదు. క్షణక్షణం, గాయం, గోవిందా గోవిందా, రాత్రి, అంతం, ద్రోహి, మనీ, అనగనగా ఒక రోజు, మృగం, రాత్, మనీ మనీ సినిమాలకు సౌండ్ ఇంజినీర్‌గా పనిచేశారు. రంగీలాతో ఎడిటర్‌గా మారి దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. ప్రస్తుతం దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తడానికి సిద్దమయ్యారు. ఎంతవారుగాని అనే సినిమా టైటిల్‌తో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే...

సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ఎంతవారుగాని. హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను, టీజర్‌ను హిట్ 2 చిత్రంతో భారీ సక్సెస్ అందుకొన్న అడివి శేష్ ఆవిష్కరించారు. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా పోస్టర్‌ అందర్నీ ఆకట్టుకొంటున్నది. ఈ సినిమా భారీ విజయం సాధించాలని ఈ సందర్భంగా అడివి శేష్ ఆకాంక్షిస్తూ.. యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

 Adivi Sesh unveils Enthavaaru Gaani Teaser

ఎంతవారుగాని సినిమాను రాజశేఖర్ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యూత్, అన్ని వర్గాల ఆడియన్స్ ఆకట్టుకొనే చిత్రం అని నిర్మాతలు తెలిపారు.

 Adivi Sesh unveils Enthavaaru Gaani Teaser

ఎంతవారుగాని చిత్రానికి ప్రవీణ్ కే బంగారి సినిమాటోగ్రఫీ అందించారు. విజయ్ కురాకుల సంగీతం అందిస్తున్నారు. జేకే మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఘ్యాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X