Don't Miss!
- News
ఆర్థిక వ్యవస్థ గుట్టుమట్లు బహిర్గతం- కీలక సర్వే: ఇంకొన్ని గంటల్లో..!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలో బ్రహ్మానందం.. ఆయన తప్ప మరొక ఆప్షన్ లేదట!
టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా కుడా తక్కువే. మూడు తరాల హీరోలను కవర్ చేసి ఎన్నో సినిమాల్లో నవ్వులు పూయించారు. బ్రహ్మానందం కోసం స్పెషల్ కామెడీ ఎపిసోడ్స్ ను క్రియేట్ చేసే లెవెల్ కు వచ్చారు. మూడు దశాబ్దాలకు పైగా బ్రహ్మానందం అలుపెరగని నటుడిగా ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. ఇక మొదటిసారి బ్రహ్మానందం పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ప్రభాస్ సినిమాలోనే అని టాక్ మొదలైంది.

ఎలాంటి సినిమా చేసినా కూడా
1987లో అహనా పెళ్ళంటా సినిమా ద్వారా తెలుగు రెగ్యులర్ కమెడియన్ గా మొదలైన బ్రహ్మానందం కెరీర్ ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటివరకు ఏ సంవత్సరం కూడా బ్రహ్మానందం వెండితెరపై గ్యాప్ ఇవ్వలేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన కామెడితోనే హైలెట్ అయ్యేవారు.జంధ్యాల నుంచి శ్రీనువైట్ల వరకు అందరూ దర్శకులు ఆయనలోని సరికొత్త కామెడీని బయటపెట్టారు.

గ్యాప్ రాకుండా చూసుకున్నారు
వెయ్యికి పైగా సినిమాలు చేసిన ఏకైక కమెడియన్ గా క్రేజ్ అందుకున్న బ్రహ్మానందం ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్టార్స్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. చాలా సినిమాలు బ్రహ్మీ కామెడీ వల్ల కూడా హిట్ అయ్యాయి. ఇక 2020లో ఆయన గ్యాప్ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ అల.. వైకుంఠపురములో.. సాంగ్ లో కనిపించి గ్యాప్ రాకుండా చూసుకున్నారు.

జాతిరత్నాలు సినిమాతో సరికొత్తగా..
ఇక బ్రహ్మానందం కామెడీ రొటీన్ అయిపోయిందని విమర్శలు వస్తున్న తరుణంలో జాతిరత్నాలు సినిమాతో సరికొత్తగా ఆకట్టుకున్నారు. కోర్టులో జడ్జీగా ఆయన చేసిన కామెడీ ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక చాలా రోజుల అనంతరం మరొక మంచి ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. ఒక పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం.
Recommended Video

ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలో..
ప్రభాస్ సినిమాలో బ్రహ్మానందం స్పెషల్ కామెడీ రోల్ కోసం సెలెక్ట్ అయినట్లు టాక్ వస్తోంది. ఆ సినిమా మరేదో కాదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ K అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం ఒక స్పెషల్ కామెడీ పాత్రలో కనిపిస్తాడని టాక్ వస్తోంది. ఆ కామెడీ పాత్రకు బ్రహ్మానందం తప్పితే మరొకరు బెస్ట్ అని అనిపించడం లేదట. నాగ్ అశ్విన్ చెప్పగానే బ్రహ్మానందం వెంటనే ఒప్పేసుకున్నట్లు సమాచారం. మరి ఆ పాత్ర ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.