అఖండ 2 పోస్ట్ పోన్.. రీసెంట్ ఉదాహరణతో బాలయ్య వెనక్కి!
నందమూరి నటసింహం, టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణ చివరిగా డాకూ మహారాజ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో తన మాస్ లుక్, మాస్ యాక్షన్ సీన్లతో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు అంతకు మించిన అంచనాలతో బాలకృష్ణ నుంచి అఖండ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ తాజాగా వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. అఖండ 2 చిత్రాన్ని వాయిదా వేయడానికి గల కారణాలను కూడా వివరించే ప్రయత్నం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
అఖండ 2 చిత్రం మేకర్స్ తాజాగా సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. బ్లాక్ బాస్టర్ కాంబిషన్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి నుంచి అఖండ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైన్ గా టాలీవుడ్ లో మోస్ట్ ఐకానిక్ చిత్రంగా నిర్వచించబడుతుంది. ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి ఇండియాలోని అత్యధికంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలోనే అఖండ 2 చిత్రం టీజర్ విడుదలై అన్నీ భాషల్లో మంచి ఆదరణను దక్కించుకుంది. దీంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

భారీ స్థాయిలో నిర్మితమవుతున్న ఈ చిత్రం రీ రికార్డింగ్, వీఎఫ్ఎక్స్, మిగితా పోస్ట్ ప్రొడక్షన్ పనులను మరింత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మరింత సమయం కావాల్సి ఉంది. అందుకు తగ్గట్టుగానే అంచనాలను రీచ్ అయ్యేలా సినిమా అవుట్ పుట్ ఉంటుందని మేకర్స్ ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి పార్ట్ అఖండ క్రియేట్ చేసిన సెన్సేషన్ ను అఖండ 2 కూడా కొనసాగిస్తుందని హామీనిచ్చారు. ఇక చిత్ర బృందం కూడా సినిమా అవుట్ పుట్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది. అందుకోసం వారంతా అవిశ్రాంతంగా రాత్రి పగలు పనిచేస్తున్నారని తెలిపారు.
ఊహకు అందని స్థాయిలో అఖండ 2 చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా పనిచేస్తున్నామన్నారు. అలాగే థియేటర్లలో ఆడియెన్స్ కు ఉత్కంఠభరితమైన విజువల్స్ ను అందించబోతున్నామని ప్రకటనలో తెలిపారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని సెప్టెంబర్ 25న రావాల్సిన అఖండ 2 చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నామని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. ప్రేక్షకులను వేచి ఉండేలా చేస్తున్నందుకు వారి అంచనాలు మించిపోవాలని పట్టుదలతో పనిచేస్తున్నామని చెప్పారు.
అయితే సెప్టెంబర్ 25నే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG చిత్రం కూడా విడుదల కానుంది. భారీ అంచనాలు కలిగి ఉండింది. దీంతో బాక్సాఫీష్ క్లాష్ నుంచి బాలయ్య వెనక్కి తగ్గారు. మరోవైపు ఇటీవల బాక్సాఫీస్ వద్ద ఆగస్టు 14న విడుదలైన రజనీకాంత్ కూలి, జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 చిత్రాలు భారీ క్లాష్ ను ఎదుర్కొన్నాయి. దీంతో ఏ సినిమాకూ పూర్తిస్థాయిలో వసూళ్లు అందే పరిస్థితి కనిపించడం లేదని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే అఖండ 2 పోస్ట్ పోన్ కావడం కూడా మంచిదేననే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇక ఈ చిత్రం 14 రీల్స్ బ్యానర్ లో రూపుదిద్దుకుంటోంది. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











