Don't Miss!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- News
ఏపీలో కానిస్టేబుల్ నియామకాల రాత పరీక్షా ఫలితాలు వెల్లడి: రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..!!
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Agent Movie Teaser: వైల్డ్ గా బూతులతో రెచ్చిపోయిన అఖిల్.. అయ్యగారి హై వోల్టేజ్ యాక్షన్
అక్కినేని హీరో అఖిల్ ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అందుకోలేదు. చివరగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించినప్పటికీ కూడా పూర్తిస్థాయిలో మాస్ ఆడియోన్స్ లో మాత్రం అఖిల్ ఇంకా సరైన గుర్తింపును అందుకోలేదు. ఎక్కువగా అతను మాస్ ను ఇంప్రెస్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఏజెంట్ సినిమాతో మాత్రం అతను బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు అనిపిస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఆ వివరాల్లోకి వెళితే...

పవర్ఫుల్ ఏజెంట్
అఖిల్ అక్కినేని సురేందర్ రెడ్డి కలయికలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ఏజెంట్ కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ ఎంతగా హార్డ్ వర్క్ చేసాడో అర్థమవుతుంది. పూర్తిగా ఫిట్నెస్ లుక్ ను కూడా మార్చేసిన అఖిల్ ఏజెంట్ సినిమాలో పవర్ఫుల్ గా కనిపించబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే అర్థమయిపోయింది.

డెత్ నోట్
ఇక ఇప్పుడు విడుదల చేసిన టీజర్ లో కూడా భయంకరమైన పాత్రతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు అనిపిస్తోంది. మొదట మమ్ముట్టి ఒక ఉన్నత అధికారిగా ఏజెంట్ గురించి చెప్పే విధానం ఎంతో ఆసక్తిని కలిగించింది. అతను చాలా భయంకరమైన ఏజెంట్ అని పట్టుకోవడం కూడా చాలా కష్టమని.. అలాగే అతని డెత్ నోట్ పేపర్లు కూడా ముందే సిద్ధం చేసినట్లు కూడా మమ్ముట్టి చెప్పే విధానం ఆసక్తిగా ఉంది

వైల్డ్ సాలే..
ఈ సినిమాలో అఖిల్ గతంలో ఎప్పుడు లేని విధంగా పవర్ఫుల్ ఫిట్నెస్ తో కనిపించబోతున్నాడు. అతని లుక్ బాడీ లాంగ్వేజ్ చాలా వైల్డ్ గా ఉంది. ఇక హీరోయిన్ అతన్ని వైల్డ్ సాలే అని సంబోధించడం కూడా ఫన్నీగా ఉంది. ప్రత్యర్ధులులను చాలా స్టైలిష్ గా గన్నులతో కాల్చడం అలాగే కాస్త సైకో షేడ్స్ కూడా మొండిగా ఉన్నట్లు అర్ధమవుతోంది.

టీజర్ అదిరింది
ఈ సినిమా టీజర్ చివరలో అర్జున్ రెడ్డి తరహా బూతు డైలాగ్ తో కూడా అఖిల్ షాక్ ఇచ్చాడు. జీప్ లో చాలా కోపంగా వెళుతూ షూట్ అంటూ వైల్డ్ గా కనిపించాడు. చూస్తుంటే ఏజెంట్ క్యారెక్టర్ లో అఖిల్ విభిన్నమైన షేడ్స్ చూపించబోతున్నట్లు అర్ధమవుతోంది. ఇక టీజర్ తోనే అతని పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

పాన్ ఇండియా రిలీజ్
ఏజెంట్ సినిమాను AK ఎంటర్టైన్మెంట్స్ పై రామ్ బ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక అఖిల్ కు జోడిగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఇక సినిమాను వరల్డ్ వైడ్ గా ఒకేసారి తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. త్వరలోనే విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ సినిమాకు హిప్ హాప్ తమిజా మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఏజెంట్ సినిమాతో అఖిల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.