‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ రిలీజ్ అప్పుడే: ఆ నెలలో ప్రేక్షకుల ముందుకు అఖిల్ మూవీ

సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ చాలా కాలమే అవుతోన్నా.. ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు అక్కినేని వారసుడు అఖిల్. వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'అఖిల్' మొదలైన అతడి ప్రయాణం.. అంత సాఫీగా సాగడం లేదు. హీరోగా మూడు చిత్రాల్లో నటించిన అఖిల్‌కు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమా చేశాడు. ఇది షూటింగ్ పూర్తైనా విడుదల మాత్రం కాలేదు. తాజాగా దీని రిలీజ్‌పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తోన్న చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం విడుదల కరోనా కారణంగా వాయిదా పడిపోయింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. దీన్ని ఆగస్టు రెండో వారంలో కానీ, చివరి వారంలో కానీ విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. అప్పటికి కరోనా ప్రభావం పూర్తిగా తగ్గి.. వంద శాతం ఆక్యూపెన్సీ ఉండే అవకాశం ఉందని చిత్ర యూనిట్ భావిస్తుందట. అందుకే ఆ నెలలోనే దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూస్తున్నారని సమాచారం.

Akhil Akkinenis Most Eligible Bachelor to be Release in August

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' నుంచి ఇప్పటికే పలు పోస్టర్లు, పాటలు, టీజర్ విడుదలయ్యాయి. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫలితంగా సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకే దీనికి ఓటీటీ ఆఫర్లు వచ్చినా చిత్ర యూనిట్ తిరస్కరించిందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీ సుందర్ సంగీతం సమకూర్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X