twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీసం మెలేసి బంగార్రాజు రిలీజ్.. డేట్ ప్రకటించిన నాగార్జున.. 50 ఏళ్ల తర్వాత అరుదైన ఘటన!

    |

    కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా కర్ఫ్యూలు, లాక్‌డౌన్స్ విధిస్తున్న సమయంలో సినిమా పరిశ్రమ సందిగ్దంలో పడింది. పలు భారీ సినిమాలు రిలీజ్‌ను వాయిదా వేసుకొన్నాయి. కానీ బంగార్రాజు మాత్రం థియేట్రికల్ రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమాను జనవరి 14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అక్కినేని నాగార్జున వెల్లడించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ నాగార్జున జీవితంలో ఓ విశిష్టతను సొంతం చేసుకొన్నది. అయితే ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..

     50 ఏళ్ల క్రితం దసరాబుల్లోడు

    50 ఏళ్ల క్రితం దసరాబుల్లోడు

    అక్కినేని కుటుంబంలో సంక్రాంతి మరుపురాని పండుగ. ఏఎన్నాఆర్ పలు సినిమాలను సంక్రాంతి రోజున రిలీజ్ చేసి సక్సెస్ సొంతం చేసుకొన్నారు. 50 ఏళ్ల క్రితం దసరా బుల్లొడు రిలీజ్ అయింది. అదే రోజున పండుగ లాంటి బంగార్రాజు సినిమా రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది అని అక్కినేని నాగార్జున తెలిపారు.

     అనుకొన్నది అనుకొన్నట్టు జరిగితే..

    అనుకొన్నది అనుకొన్నట్టు జరిగితే..

    బంగార్రాజు సినిమా పండుగ లాంటి సినిమా. షూటింగ్ మొదలు పెట్టినప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాం. అధికారికంగా ఎందుకు ప్రకటించలేదంటే.. మేము ఆలస్యంగా ఆగస్టు చివరి వారంలో షూటింగ్ మొదలుపెట్టాం. సంక్రాంతి పండుగకు సినిమా పూర్తి అవుతుందా? లేదా అనే సందేహంలో ఉన్నాం. ఇప్పుడు ప్రొడక్షన్ టీమ్‌తో కన్ఫర్మ్ చేసుకొన్న తర్వాత రిలీజ్ ప్రకటించడానికి వచ్చాం. ఈ సినిమాను జనవరి 14వ తేదీన రిలీజ్ చేస్తున్నాం. అంతా సవ్యంగా సాగితే.. అనుకొన్నది అనుకొన్నట్టు జరిగితే సంక్రాంతి రోజున సినిమా రిలీజ్ అవుతుంది అని నాగార్జున తెలిపారు.

    తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి

    తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి

    బంగార్రాజు సినిమా షూటింగు సమయంలో ఓ సూపర్ నేచురల్ పవర్ ఉండటం వల్లే మేము సకాలంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా సినిమాను పూర్తి చేశాం. ఈ సినిమాను సకాలంలో పూర్తి చేయడంలో సహకరించిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ ఇప్పుడు చెప్పను. సినిమా సక్సెస్ అయిన తర్వాతే నేను అందరికి థ్యాంక్ష్ చెబుతాను. తక్కువ సమయంలో సినిమా ఎలా పూర్తి చేశారని అడుగుతున్నారు. మేము సినిమా కంప్లీట్ చేయడంలో ఎలాంటి రాజీ పడలేదు అని నాగార్జున అన్నారు.

    RRR, రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా పడటం

    RRR, రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా పడటం

    RRR, రాధేశ్యామ్ సినిమాల రిలీజ్ వాయిదా పడటం చాలా విచారకరం. అది మాకు అడ్వాంటేజ్ అవుతుందా? లేదా? అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఆ రెండు సినిమాల కంటే ఒమిక్రాన్ మాకు పెద్ద సవాల్. అయితే RRR, రాధేశ్యామ్ సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాలి. అయితే ఆ రెండు సినిమాలు రూపొందించడానికి గత మూడేళ్లుగా ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. RRR సినిమా ఇప్పటికే కరోనావైరస్ కారణంగా రెండుసార్లు వాయిదా పడింది. ఏది ఏమైనా మా సినిమా వస్తుండటం కొంత హ్యాపీగా ఉంది అని నాగార్జున అన్నారు.

     పంచెకట్టులో ఎంజాయ్ చేశాం

    పంచెకట్టులో ఎంజాయ్ చేశాం

    నాన్న గారు పంచెకట్టుతో అభిమానులను ఆకట్టుకొన్నాడు. పంచెకట్టులో అందం ఉంది. ఓ పొగరు ఉంటుంది. ఓ పవర్ ఉంటుంది. పంచెకట్టులో ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాం. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ సినిమా. థియేటర్స్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తారనే నమ్మకం. నా చిన్నతనం నుంచి సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ కావడమనేది జరుగుతూనే ఉంది. సంక్రాంతికి నాన్న సినిమాలు రిలీజ్ కావడం అనవాయితీగా ఉండేది. ఇప్పుడు దానిని నేను కొనసాగిచడం హ్యాపీగా ఉంది అని నాగార్జున తెలిపారు.

    తొలిసారి నాగచైతన్య అలాంటి పాత్రలో

    తొలిసారి నాగచైతన్య అలాంటి పాత్రలో

    నాగచైతన్య ఇప్పటి వరకు గ్రామీణ వాతావరణం ఉన్న సినిమాలు చేయలేదు. జానకిరాముడు, సోగ్గాడే చిన్నినాయనా నాకు మంచి సక్సెస్ అందించాయి. నాగచైతన్యకు కూడా నేటివ్ సినిమా మంచి బ్రేక్ ఇస్తుంది. నాగచైతన్యకు మంచి సినిమా అవుతుంది అని నాగార్జున తెలిపారు.

    Recommended Video

    83 Movie Promotions : Ranveer Singh Fun With Kapil Dev And Nagarjuna | Filmibeat Telugu
     కలెక్షన్ల గురించి పట్టించుకోను

    కలెక్షన్ల గురించి పట్టించుకోను

    నా కెరీర్‌లో కలెక్షన్ల గురించి పట్టించుకోలేదు. ప్రతీ సంవత్సరం వసూళ్ల లెక్కలు మారుతుంటాయి. వసూళ్ల గురించి అంతగా పట్టించుకోవద్దు. కలెక్షన్ల కంటే ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆలోచిస్తాను. బాక్సాఫీస్ లెక్కల గురించి నేను ఎప్పుడో దూరమయ్యాను అని నాగార్జున అన్నారు.

    English summary
    Actor Akkineni Nagarjuna's Bangarraju movie is set to release on January 14th amid Coronavirus situation. He shared the behind scenes of Bangarraju.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X