అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్న నాగ చైతన్య.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో మూడు తరాల హీరోలను అందించిన కుటుంబాల్లో అక్కినేని వారి ఫ్యామిలీ ఒకటి. నాగేశ్వర్రావు తర్వాత నాగార్జున హీరోగా చిత్ర సీమకు పరిచయం అయ్యారు. ఇక, ఆయన వారసులుగా నాగ చైతన్య, అఖిల్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరుగా తమ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వీరితో పాటు సమంత కూడా పలు చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఖుషీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి మరో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు యువ సామ్రాట్ చైతూ. ఇంతకీ ఏంటా న్యూస్.? వివరాల్లోకి వెళ్తే..

 వాళ్లిద్దరికీ కలిసి రాలేదు.. చైతూ మాత్రం కొట్టాడు

వాళ్లిద్దరికీ కలిసి రాలేదు.. చైతూ మాత్రం కొట్టాడు

నాగార్జున, అఖిల్, నాగ చైతన్య గత ఏడాది పలు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీరిలో చైతూ మాత్రమే రెండు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో సమంతతో కలిసి నటించిన ‘మజిలీ' ఒకటి కాగా.. వెంకటేష్‌తో చేసిన ‘వెంకీమామ' రెండోది. ఇక, నాగార్జున ‘మన్మథుడు 2'.. అఖిల్ ‘మిస్టర్ మజ్నూ' బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి.

 నాగ్‌ విషయంలో ఒక చెడు.. ఒక మంచి

నాగ్‌ విషయంలో ఒక చెడు.. ఒక మంచి

నాగార్జున.. రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘మన్మథుడు 2'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా చేసిన ఈ మూవీ ఎన్నో అంచనాలతో విడుదలైంది. కానీ, ప్రేక్షకులతో పాటు అక్కినేని అభిమానులను సైతం నిరాశ పరిచింది. మరోవైపు, నాగ్ హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్' సీజన్ -3 మాత్రం గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో పలు రికార్డులు కూడా బద్దలైపోయాయి.

 తండ్రి కొడుకులు అస్సలు తగ్గడం లేదు

తండ్రి కొడుకులు అస్సలు తగ్గడం లేదు

ఇక, నాగార్జున చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇందులో ఆయన ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా కనిపించబోతున్నారు. అలాగే, అఖిల్.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య కూడా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న మూవీలో చేస్తున్నాడు. ఈ మూడు చిత్రాలు 2020లోనే విడుదల కానున్నాయి.

మళ్లీ తెరపైకి వచ్చిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు

మళ్లీ తెరపైకి వచ్చిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు

నాగార్జున గతంలో నటించి మెప్పించిన చిత్రాల్లో ‘సోగ్గాడే చిన్ని నాయన' ఒకటి. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అందుకే ఈ సినిమాకు ప్రీక్వెల్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘బంగార్రాజు' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా అవలేదు. తాజాగా ఇది మరోసారి తెరపైకి వచ్చింది.

Recommended Video

Akkineni Nagarjuna Emotional Speech @ ANR National Awards Function
ఇద్దరినీ మెప్పించాడు.. మొదలెట్టేశాడు

ఇద్దరినీ మెప్పించాడు.. మొదలెట్టేశాడు

ఇందులో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా నటిస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా స్క్రిప్టును వాళ్లిద్దరికీ వినిపించాడట కల్యాణ్. అది ఇద్దరికీ బాగా నచ్చేసిందట. దీంతో ఈ మూవీని త్వరలోనే ప్రారంభించబోతున్నారని తాజా సమాచారం. అంతేకాదు, దీనికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్ కూడా స్టార్ అయ్యాయని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X