నాగార్జున డ్రీమ్ ప్రాజెక్టుకు ముహూర్తం ఫిక్స్: ఒకే దెబ్బకు పూర్తయ్యేలా ప్లాన్ చేసేశారుగా!

అక్కినేని నాగార్జున - కల్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయన'. రెండేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. తద్వారా అక్కినేని హీరో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో నాగ్ రెండు పాత్రల్లో నటించాడు. అందులో బంగార్రాజు పాత్రకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆయన స్టైల్‌ను ఎంతో మంది ఫాలో అయిపోయారు కూడా. ఈ కారణంగానే ఈ చిత్రానికి ప్రీక్వెల్‌ తీయాలని డిసైడ్ అయిపోయాడీ టాలీవుడ్ సీనియర్ హీరో.

'బంగార్రాజు' మూవీ కోసం కల్యాణ్ కృష్ణ ఎప్పుడో స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టేశాడు. దీంతో ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలోనే నాగార్జున కొన్ని సినిమాలతో పాటు బిగ్ బాస్ షోను పూర్తి చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన డ్రీమ్ ప్రాజెక్టును ప్రారంభించడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకన్నాడట నాగ్. తాజా సమాచారం ప్రకారం.. జనవరి 16న జరిగే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం అవుతుందట. ఆ వెంటనే రెగ్యూలర్ షూటింగ్ కూడా మొదలు పెడతారని టాక్.

Akkineni Nagarjunas Bangarraju Start From Jan 16th

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయబోతున్నారని తెలుస్తోంది. దీని కోసం హైదరాబాద్‌లోనే ప్రత్యేక సెట్‌ను నిర్మించబోతున్నారని అంటున్నారు. ఇక, ఈ సినిమాలో అక్కినేని హీరోలు నాగ చైతన్య, అఖిల్‌లో ఒకరు నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం సోలోమన్ దర్శకత్వంలో 'వైల్డ్ డాగ్' అనే సినిమాను చేస్తున్నాడు నాగార్జున. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇందులో ఆయన తొలిసారి ఏఎన్ఐ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X