twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రైతులకు సపోర్టుగా పాప్ సింగర్ ట్వీట్.. విభేదాలు సృష్టించవద్దంటూ అక్షయ్, కరణ్ జోహర్ ట్వీట్లు

    |

    కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తరాదిలో జరుగుతున్న రైతుల ఆందోళన ప్రస్తుతం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. పాప్‌స్టార్ రిహన్నా, పర్యావరణ వేత్త గ్రేటా థంబెర్గ్ రైతు ఉద్యమానికి మద్దతుగా ట్వీట్లు చేయడం వివాదంగా మారింది. రిహాన్నా, గ్రేటా ట్వీట్లపై భారత విదేశాంగశాఖ అసంతృప్తిని వ్యక్తం చేసింది. భారత దేశం గురించి ఏ మాత్రం తెలియని వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేయడం దురుదృష్టకరం అని వ్యాఖ్యానించింది.

    భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఈ వివాదంపై స్పందిస్తూ.. ఇలాంటి సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. సమస్య గురించి సరైన అవగాహన స్పందించాల్సి ఉంటుంది. హ్యాష్‌ట్యాగ్‌, కామెంట్లతో సోషల్ మీడియాలో సెన్సేషనలైజ్ చేయడానికి ఇలాంటి సున్నిత అంశాలపై సెలబ్రిటీలు మరింత బాధ్యతగా ఉండాలి అంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు.

    Akshay Kumar, Karan Johar reaction on Rihanna, Greta tweets on Farmers strike

    రిహన్నా, గ్రేటా ట్వీట్‌పై స్పందిస్తూ అక్షయ్ కుమార్, కరణ్ జోహర్ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. మనమంతా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రతీ విషయంలోనూ సహనంతో ఉండాలి. దేశానికి వెన్నముకగా నిలిచిన రైతన్న సమస్యకు పరిష్కారం చూపడానికి మనమంతా కలిసి ముందుడుగు వేద్దా. మనలో విభేదాలను సృష్టించడానికి ప్రయత్నించే వారి విషయంలో జాగ్రత్తగా ఉందాం అంటూ కరణ్ జోహర్ ట్వీట్ చేశారు.

    రైతులకు సంబంధించిన ఏ సమస్యనైనా, డిమాండ్ అయినా దేశానికి చాలా ముఖ్యం. వారి సమస్యలను పరిష్కరించడానికి జరుగుతున్న చర్చలు, చర్యలు అందరికి తెలిసిందే. విభేదాలు సృష్టించడానికి, సమస్యను మరింత జటిలం చేయడానికి బదులు సరైన పరిష్కారం చూపడానికి సహకరిద్దాం అని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. అనురాగ్ శ్రీవాస్తవ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ తన సందేశాన్ని అక్షయ్, కరణ్ జోహర్ పోస్టు చేశారు.

    English summary
    Karan Johar wrote on his Twitter handle that We live in turbulent times and the need of the hour is prudence and patience at every turn. Let us together, make every effort we can to find solutions that work for everyone—our farmers are the backbone of India. Let us not let anyone divide us.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X