Just In
- 1 min ago
సరికొత్త లుక్‌లో అక్కినేని హీరో: అఖిల్ కొత్త సినిమా మొదలయ్యేది అప్పుడే
- 7 min ago
Box office: 6వ రోజు అల్లుడు అదుర్స్ డౌన్.. రెడ్ సినిమాకు వచ్చింది ఎంతంటే?
- 45 min ago
KGF Chapter 2 నుంచి షాకింగ్ అప్డేట్: ఆ ఒక్క దాని కోసమే రూ. 12 కోట్లు ఖర్చు
- 56 min ago
రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రామ్ సినిమా: కొత్త మూవీ విడుదలకు డేట్ ఫిక్స్
Don't Miss!
- Automobiles
2030 నాటికి భారత్‌లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు
- News
బైడెన్ ఇనాగురల్ స్పీచ్ వెనుక తెలంగాణ మాస్టర్ మైండ్.. ఆ ప్రసంగాన్ని డ్రాఫ్ట్ చేసింది మనోడే...
- Finance
అమెరికా ప్యాకేజీ ఎఫెక్ట్, సెన్సెక్స్ భారీగా జంప్: రిలయన్స్, ఐటీ స్టాక్స్ అదుర్స్
- Lifestyle
శృంగారాన్ని ప్రతిరోజూ ఆస్వాదించాలంటే... ఈ చిట్కాలను పాటించండి...
- Sports
అతని గురించి ఎంత చెప్పినా తక్కువే.. శరీరానికి ఎన్ని దెబ్బలు తగిలినా మ్యాచ్ కాపాడాడు: గవాస్కర్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దిల్ రాజుకు క్లిష్ట పరిస్థితి: బన్నీ కోసం మహేశ్‌ను వదలుకొంటున్నాడా?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న బడా ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు. మొదట్లో డిస్ట్రిబ్యూటర్‌గా ఎన్నో సినిమాలను పంపిణీ చేసిన ఈయన.. నితిన్ నటించిన 'దిల్' అనే సినిమాతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత తీసిన 'ఆర్య', 'భద్ర', 'బొమ్మరిల్లు' సూపర్ హిట్ అవడంతో భారీగా లాభాలను అర్జించారు. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినప్పటికీ వెనుకడుగు వేయలేదు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలతో సైతం సినిమా చేస్తూ బడా ప్రొడ్యూసర్ అయిపోయారు. కథ నచ్చితే చిన్న హీరోలతోనూ సినిమాలు చేసిన ఈయన.. మంచి టేస్ట్ ఉన్న నిర్మాత అనిపించుకున్నారు. సినిమా చేతిలో పడితే హిట్టే అన్న టాక్ సంపాదించుకున్న దిల్ రాజుకు ఊహించని కష్టం వచ్చింది. అది కూడా ఇద్దరు స్టార్ హీరోల వల్ల. వివరాల్లోకి వెళితే...

చాలా మందిని తీసుకొచ్చాడు
దిల్ రాజు కెరీర్ ఆరంభంలోనే ఎంతో మంది డైరెక్టర్లను చిత్ర సీమకు పరిచయం చేశాడు. ఆయన బ్యానర్ ద్వారా వచ్చిన వారిలో సుకుమార్, బోయపాటి శ్రీను, బొమ్మరిల్లు భాస్కర్, వంశీ పైడిపల్లి, శ్రీకాంత్ అడ్డాల, వాసు వర్మ, వేణు శ్రీరామ్ సహా ఎంతో మంది ఉన్నారు. వీళ్లందరూ ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా పేరొందుతున్నారంటే దిల్ రాజే కారణం అన్న విషయం చెప్పనక్కర్లేదు.

బడా హీరోలందరూ ఉన్నారు
ప్రస్తుతం టాలీవుడ్‌లో బడా ప్రొడ్యూసర్‌గా ఉన్న దిల్ రాజుతో సినిమా చేయడానికి చాలా మంది హీరోలు ఎదురు చూస్తూ ఉంటారు. వీరిలో స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడని ఈయన నైజం అందరినీ ఆకర్షిస్తోంది. అలాగే, సినిమా ప్రమోషన్ విషయంలోనూ ఆయన రాజీ పడకుండా ఉంటారు. అందుకే దిల్ రాజు ప్రొడక్షన్ సక్సెస్ అవుతోంది.

ఈ ఏడాది చివర్లో షాక్ తగిలింది
దిల్ రాజు ప్రస్తుతం చాలా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాటిలో అనిల్ రావిపూడి - మహేశ్ బాబు కలయికలో వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు' వచ్చే ఏడాది విడుదల కానుంది. దీనికి ఆయన సహా నిర్మాత. అలాగే, ‘96' రీమేక్ కూడా అప్పుడే రానుంది. ఇక ఇటీవల వచ్చిన రాజ్ తరుణ్ ‘ఇద్దరి లోకం ఒకటే' మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో షాక్ తగిలింది.

దిల్ రాజుకు కొత్త కష్టం
దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్న వ్యవహరిస్తున్న మహేశ్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. ఒకరోజు గ్యాప్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ‘అల.. వైకుంఠపురములో' కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నైజాం ఏరియా రైట్స్‌ను దిల్ రాజే కొన్నారు. దీంతో ఆయనకు కొత్త కష్టం వచ్చింది.

బన్నీ కోసం మహేశ్‌ను వదులుకోవాలి
సంక్రాంతి ఫైట్ హీరోలతో పాటు దిల్ రాజుకు కూడా టెన్షన్‌ను క్రియేట్ చేస్తోంది. మహేశ్ సినిమా 11న వస్తుంది. ఈ సినిమా బాగున్నా లేకున్నా కలెక్షన్లు మాత్రం భారీగానే వస్తాయి. తర్వాతి రోజు వచ్చే బన్నీ సినిమా కోసం ‘సరిలేరు' థియేటర్లు ఖాళీ చేయించాలి. ఇది దిల్ రాజును ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సింగిల్ థియేటర్స్‌లో సినిమా తీస్తే కలెక్షన్లపై ప్రభావం చూపొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో బడా ప్రొడ్యూసర్ టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.