Just In
- 6 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 10 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- News
వెర్టికల్ ఛార్లీ స్పెషల్ అట్రాక్షన్: విన్యాసాల కోసం ఎదురు చూపులు: కాస్సేపట్లో నింగిలోకి
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Sports
ISL 2020 21: చెన్నయిన్ X ముంబై మ్యాచ్ డ్రా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'అల వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ వేదిక ఎక్కడో తెలుసా..?
అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'అల వైకుంఠపురములో'. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే సినిమా షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేసిన చిత్రయూనిట్.. ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.
ఈ మేరకు జనవరి 6వ తేదీని ఫైనల్ చేసిన త్రివిక్రమ్ తాజాగా వేదిక కూడా ఖరారు చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో పేర్కొన్న డీటెయిల్స్ ప్రకారం జనవరి 6న సాయంత్రం 5 గంటలకు యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో 'అల.. వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ జరగనుంది. వైభవంగా, వినూత్నంగా జరగనున్న ఈవెంట్‌కి మ్యూజికల్ కాన్సర్ట్ అని నామకరణం చేశారు. అంటే బన్నీ పాటలు, థమన్ బాణీలతో యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ మారుమ్రోగనున్నాయన్నమాట.

మరోవైపు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ''సామజవరాగమన, రాములో రాములా'' పాటలు రికార్డుల సునామీ సృష్టిస్తూ 'అల.. వైకుంఠపురములో' స్థాయిని తెలియజేశాయి. థమన్ అందించిన బాణీలకు ఫిదా అయింది ప్రేక్షకలోకం. గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో రూపొందిన ఈ సినిమాపై బన్నీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషించింది. అల్లు అర్జున్- టబు మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది.