Just In
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మేమంతా పండగకు మీ ఇంటికి వచ్చినట్టు ఉంటుంది.. సునిల్ స్పీచ్
నా పేరు సూర్య తరువాత గ్యాప్ ఇచ్చిన అల్లు అర్జున్.. అల వైకుంఠపురములో సినిమాతో దాన్ని పూడ్చేందుకు సిద్దమయ్యాడు. గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది అంటూ క్లారిటీ ఇస్తూ వదిలిన 'అల' గ్లింప్సెస్ నుంచి రీసెంట్‌గా వదిలిన టైటిల్ ట్రాక్ వరకు అల వైకుంఠపురములో కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే పోతోంది. మ్యూజికల్ సెన్సేషనల్‌గా మారిన అల వైకుంఠపురములో ఆల్బమ్ బన్నీ ఫ్యాన్స్‌నే కాక సినీ ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంది. ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్దమైంది. విడుదలకు దగ్గర పడుతుండగా.. ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో నేటి సాయంత్రం అల వైకుంఠపురములో మ్యూజికల్ కాన్సర్ట్‌ను ఏర్పాటు చేసింది యూనిట్. ఈ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
సునీల్ మాట్లాడుతూ.. 'బన్నీ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం.. చాలా దూరం నుంచి వచ్చారు.. ఈ సినిమా ఎలా ఉంటుంది.. అంటే మీరు టికెట్ కొని థియేటర్‌కు వెళితే బన్నీ, పూజా, టబు, సునీల్, సముద్రఖని ఇలా మేమంతా మీ ఇంటికి వచ్చినట్టు ఉంటుంది. మీరు థియేటర్‌కు వచ్చినట్టు కాదు..మేమే మీ ఇంటికి వచ్చినట్టు ఉంటుంది. త్రివిక్రమ్ గురించి నేను ఎక్కువ చెప్పను.. ఎంత చెప్పినా తక్కువే అవుతుంది..ఆయన ఒక డ్రెస్ కొన్నాడు.. అది కచ్చితంగా వేసుకునే బయటకు వెళ్లాలి..అలానే ఆయన తీసే ప్రతి సినిమాలోనూ నన్ను పెడుతున్నాడు.

పెద్దింట్లో పుట్టామని యాటిట్యుడ్ ఏ మాత్రం ఉండదు.. ఓ హీరో క్యారవ్యాన్‌లో కూర్చున్నది పరుగు చిత్రం సమయంలోనే. అది ఆయనదో మాదో తెలియనంతగా ఉండేది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత అల వైకుంఠపురములో చిత్రంలో బన్నీతో కలిసి చేస్తున్నాను. ఈ చిత్రం కచ్చితంగా హిట్.. ఆ వెంకటేశ్వరస్వామి హింట్ ఇచ్చాడు. ఈ రోజు ఉదయాన్నే దర్శనం చేసుకున్నాను. సీక్రెట్‌గా చెప్పాడు.. పండగకి నిజంగానే పండగ వస్తుందని చెప్పాడ'ని అన్నాడు.