twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టైలిష్ స్టార్ ఖాతాలో మరో రికార్డు.. దుమ్మురేపిన అల వైకుంఠపురం బిజినెస్

    |

    టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు అల్లు అర్జున్ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత అలా వైకుంఠపురం చిత్రం కోసం మళ్లీ ఈ జోడి చేతులు కలిపింది. షూటింగ్ దశలోనే ఈ చిత్రం భారీ అంచనాలను నెలకొల్పింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్, 'గీతాఆర్ట్స్' అధినేతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా హక్కుల అమ్మకాల విషయం మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

    సంక్రాంతి పండుగ కోసం ముస్తాబవుతున్న అల వైకుంఠపురం చిత్రానికి సంబంధించిన హక్కుల బిజినెస్ చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. ఈ సినిమా తెలుగు, మలయాళ హక్కులు వ్యాపారం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ రెండు భాషల్లో కలిపి రికార్డు బిజినెస్ జరిగింది. తెలుగు, మలయాళ భాషల్లో కలిపి రూ.29 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    Ala vaikunthapurramuloo pre release business

    గతంలో అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమా తెలుగు, మలయాళం, హిందీ డబ్బింగ్ రైట్స్ అప్పట్లో రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. ఆ సినిమా హక్కులు రూ.24 కోట్లకు అమ్ముడుపోవడం జరిగింది. కాగా, అల వైకుంఠపురం హిందీ డబ్బింగ్ రైట్స్ ఇంకా బిజినెస్ జరగకపోవడం గమనార్హం. ఇలా హిందీ రైట్స్ బిజినెస్ జరగకుండానే స్టైలిష్ స్టార్ ఖాతాలో రికార్డు బిజినెస్ జరిగింది.

    నటీనటులు: అల్లు అర్జున్, పూజ హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ
    దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
    నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)
    సినిమాటోగ్రఫి: పిఎస్ వినోద్,
    సంగీతం: థమన్ ఎస్,
    ఎడిటర్: నవీన్ నూలి:
    ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
    ఫైట్స్: రామ్ - లక్ష్మణ్
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్

    English summary
    Stylish Star Allu Arjun and the Wizard of words Thrivikram Srinivas coming together for one more time. Two crazy production houses Geetha Arts and Harika and Hassinie Creations producing this project. Makers named it "ala Vykuntapuram lo" and Trivikram's taste and Bunny's style in the title. This movies pre release business of Telugu, Malayalam don with Rs.29 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X