Just In
- 57 min ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
- 2 hrs ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్‌నే ఫిక్స్ చేశారు
- 3 hrs ago
టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!
- 3 hrs ago
రాజమౌళి - మహేశ్ మూవీ నుంచి షాకింగ్ న్యూస్: ఎవరూ ఊహించని పాత్రలో సూపర్ స్టార్
Don't Miss!
- Lifestyle
ఆరోగ్య సమస్యలకు మన పూర్వీకులు ఉపయోగించే కొన్ని విచిత్రమైన నివారణలు!
- Finance
పెట్రోల్, డీజిల్ ధరలు జంప్: హైదరాబాద్‌లో ఎంత ఉందంటే
- News
కేసీఆర్ నాయకుడు అయ్యింది ఎన్టీఆర్ వల్లే... కృతజ్ఞత ఉంటే రుణం తీర్చుకో .. బీజేపీ నేత సూచన
- Sports
Brisbane Test: తొలిసారి ఐదేసిన సిరాజ్.. ఆసీస్ ఆలౌట్! టీమిండియా టార్గెట్ 328!
- Automobiles
టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో పెర్ఫార్మెన్స్ను చూపించే కొత్త టీజర్ విడుదల
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అభిమానులకు రామ్‌చరణ్ సూచన.. 'అల.. వైకుంఠపురములో' సినిమాపై కామెంట్
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలు తెలపడమే గాక తోటి హీరోల సినిమాలు విడుదలైనప్పుడు తన రెస్పాన్స్ చెబుతుంటారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో' విడుదల సందర్బంగా చెర్రీ సోషల్ మీడియా సందేశమిచ్చారు. వివరాల్లోకి పోతే..

భారీ అంచనాలు.. ఓ రేంజ్‌లో 'అల.. వైకుంఠపురములో' రిలీజ్
సంక్రాంతి కానుకగా ఈ రోజు (జనవరి 12) భారీ అంచనాల నడుమ విడుదలైంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అన్ని ఏరియాల్లో 'అల.. వైకుంఠపురములో' డిమాండ్ కనిపిస్తోంది.

రామ్ చరణ్ కామెంట్.. అల్లు అర్జున్, త్రివిక్రమ్
ఈ నేపథ్యంలో 'అల.. వైకుంఠపురములో' సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో తన కామెంట్ పోస్ట్ చేశారు రామ్ చరణ్. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ 'అల.. వైకుంఠపురములో' థియేట్రికల్ ట్రైలర్ షేర్ చేశారు. ఈ మేరకు అభిమానులకు ఓ రిక్వెస్ట్ కూడా చేశారు చెర్రీ.

రామ్ చరణ్ రిక్వెస్ట్.. పోస్ట్ వైరల్
ఆల్ ది బెస్ట్ తో మై బ్రదర్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ గారు, వినోద్ గారు అని చెప్పిన రామ్ చరణ్.. సినిమాను థియేటర్స్‌లో మాత్రమే చూడండని రిక్వెస్ట్ చేశారు. పైరసీని ఎంకరేజ్ చేయొద్దని తెలిపారు. ఆయన పెట్టిన ఈ పోస్ట్ మెగా అభిమానులను ఖుషీ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫస్ట్ డే.. అభిమానుల కోలాహలం
మరోవైపు 'అల.. వైకుంఠపురములో' సినిమా చూసేందుకు పెద్దఎత్తున జనం థియేటర్స్‌కి విచ్చేస్తున్నారు. ప్రీమియర్స్ ద్వారా సక్సెస్ టాక్ రావడంతో సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అన్ని సెంటర్లలో అభిమానుల కోలాహలం కనిపిస్తోంది.

'అల.. వైకుంఠపురములో' నటీనటులు
త్రివిక్రమ్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి సుశాంత్, నివేతా పేతురాజ్, సునీల్, బ్రహ్మాజీ, నవదీప్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించారు.