Just In
- 31 min ago
Uppena 22 Days Collections: అన్ని సినిమాలున్నా తగ్గని ‘ఉప్పెన’.. వాటితో పోల్చితే కలెక్షన్లు ఎక్కువే
- 34 min ago
సోషల్ మీడియాలో మరో రికార్డును అందుకున్న విజయ్ దేవరకొండ.. నెంబర్ వన్!
- 48 min ago
చెడ్డి దోస్తాన్ వాల్యూ చూపించిన రామ్ చరణ్.. యువ హీరోకు సడన్ సర్ ప్రైజ్
- 1 hr ago
ముంత కల్లుతో సింగర్ సునీత.. చేతిలో కల్లు గ్లాస్, పక్కన మరో యాంకర్ కూడా..
Don't Miss!
- News
259 మంది సభ్యులతో కమిటీ.. కేసీఆర్, జగన్, చంద్రబాబుకు చోటు, తెలుగువారు వీరే..
- Sports
ఆ సమయంలో పంత్ స్కూప్ షాట్.. ఎవరైనా ఇలా ఆడగలరా అంటూ మాజీల ఆశ్చర్యం వీడియో
- Automobiles
కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ టీజర్; త్వరలో భారత్‌లో విడుదల - వివరాలు
- Finance
గుడ్‌న్యూస్: క్రిప్టోకరెన్సీ వినియోగంపై ఆలోచిస్తున్నాం..నిర్మలమ్మ ఏం చెప్పారంటే..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అది సహజంగానే వచ్చేసింది .. చిరంజీవే మాకు గైడెన్స్.. అల్లు అర్జున్ సెన్సేషనల్ కామెంట్స్
అల్లు అర్జున్ గ్యాప్ తీసుకుని వచ్చినా చాలా గట్టిగా కొట్టాడు. బన్నీ కొట్టిన దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అయింది.. ఇంకా అవుతూనే ఉంది. అల వైకుంఠపురములో చిత్రంతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేస్తున్నాడు బన్నీ. ఇప్పటికే రూ.250కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ఔరా అనిపించాడు. ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండగా.. తాజాగా ఓ మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలను వెల్లడించాడు.

బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారా?
అల వైకుంఠపురములో 200కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.. బాలీవుడ్ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అని అడిగితే బన్నీ ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. ‘అవును త్వరలోనే అది కూడా జరుగుతుంది.. అయితే నా మైండ్‌లో ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్ లేద'ని తెలిపాడు.

‘అర్జున్ రెడ్డి'లాంటివి..
అర్జున్ రెడ్డి లాంటి ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయనని గతంలో చెప్పారు.. అవేమైనా హద్దులా భావిస్తున్నారా? అని అడిగితే.. ‘వాటిని హద్దులు అని అనడం కంటే.. నా బలమని చెప్పుకుంటాను. నేను ఇప్పుడు పెద్ద ఫ్లాట్‌ఫామ్ మీదున్నాను.. మళ్లీ సింగిల్ జానర్ చిత్రాలకు వెళ్లకూడద'ని తెలివిగా సమాధానమిచ్చాడు.

అది సహజంగానే..
డ్యాన్స్ మూమెంట్స్ గురించి అడిగితే.. ‘నేనేమీ ప్రత్యేకంగా శిక్షణైతే తీసుకోలేదు. అయితే చిన్నప్పటి నుంచీ డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను. అది సహజంగా నాలోపలిక వచ్చేసింది. సాంగ్ షూట్ చేసే ముందు ప్రాక్టీస్ చేయడం కూడా కలిసి వస్తుంద'ని బన్నీ తెలిపాడు.

చిరంజీవి మాకు దిశానిర్దేశం..
‘మాకున్న ఈ విలువలు చిరంజీవి నుంచే తీసుకున్నవే, నేర్చుకున్నవే. ఆయన సమస్యలను ఎలా డీల్ చేస్తారో చూస్తే.. అదే మాకు గైడెన్స్.. ఆయనే మాకు స్ఫూర్తి' అంటూ బన్నీ అన్నాడు.

కొత్తగా కనిపించాలి..
‘ప్రతీ పాత్రకు కొంత భిన్నంగా కనిపించాలి.. అల వైకుంఠపురములో చిత్రం ఎంటర్టైనర్.. ప్రస్తుతం కొత్త సబ్జెక్ట్ కోసం ఎదురుచూస్తున్నాను' అంటూ స్క్రిప్ట్‌ల ఎంపిక గురించి బన్నీ తన అభిప్రాయాన్ని తెలిపాడు.