అల్లు అర్జున్ మరో రికార్డు.. మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ లను దాటేసిన ఐకాన్ స్టార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించి పుష్ప : ది రైజ్ చిత్రం తర్వాత అల్లు అర్జున్ రేంజ్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. పుష్ప 2: ది రూల్ చిత్రం తర్వాత మరింత సెన్సేషన్ గా మారారు. అయితే పుష్ఫ ఫ్రాంచైజీతో అల్లు అర్జున్ కు ప్రతిష్టాత్మకమైన అవార్డులు దక్కుతున్నాయి. ఎంతో నేర్పు ఉన్న నటుడిగా ప్రశంసలు అందుకోవడంతో స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ ల్లో సత్తా చాటుతూ వస్తున్నారు అల్లు అర్జున్. తాజాగా పుష్ప 2 చిత్రంలో తన నటకు గానూ మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును సొంతం చేసుకున్నారు.

ఇప్పటి వరకు అల్లు అర్జున్ 20కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. అల్లు అర్జున్ గంగోత్రి అనే చిత్రంతో కెరీర్ ను ప్రారంభించారు. ఈ చిత్రం 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి చిత్రంతోనే హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య 2, జూలాయి, ఇద్దరమ్మాయిలతో, రేసు గుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు, నా పేరు సూర్య, అలా వైకుంఠపురంలో, పుష్ఫ: ది రైజ్, పుష్ప 2: ది రూల్ వంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు.

Allu Arjun Created Record in Award Winning

అయితే అల్లు అర్జున్ తన సినిమా సినిమాకు క్యారెక్టరైజేషన్ లో, కథలో, సినిమా రేంజ్ లో చాలా మార్పులు చూపిస్తూనే వస్తున్నారు. పుష్ప చిత్రంలో పుష్పరాజ్ పాత్రతో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారారు. ఆ చిత్రంలో అల్లు అర్జున్ నటనకు గానూ ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా దక్కడం విశేషం. దాంతో పాటు అల్లు అర్జున్ కెరీర్ లో 50కి పైగా అవార్డులను అందుకున్నారు. ఇందులో సినీ మా అవార్డ్స్, ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్స్ సౌత్, గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్, IFFA, మిర్చి మ్యూజిక్, నంది అవార్డ్స్, ఒక నేషనల్ అవార్డ్, ఇక తాజాగా పుష్ప 2 చిత్రానికి గానూ SIIMA అవార్డ్ ను అందుకున్నారు.

అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ గా దాదాపు ప్రతి చిత్రానికి అవార్డ్ దక్కడం విశేషం. ఇక తాజాగా పుష్పరాజ్ పాత్రలో పార్ట్ 2 పెర్ఫామెన్స్ కు దుబాయ్ లో సైమా అవార్డ్ దక్కడం విశేషం. తాజాగా దుబాయ్ ఈవెంట్ లో అవార్డ్ ను స్వీకరించారు. అల్లు అర్జున్‌తో పాటు బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్, బెస్ట్ యాక్ట్రెస్ గా రష్మిక మందన్న అవార్డ్స్ ను అందుకున్నారు. ఇక అల్లు అర్జున్ తాజా అవార్డ్ తో సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు.

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అత్యధిక అవార్డులను సొంతం చేసుకున్న హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. 50 అవార్డులను అందుకోవడంతో పాటు 10 అవార్డులకు నామినేట్ అయ్యారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్ స్టార్ అయిన మహేశ్ బాబు ఇప్పటి వరకు 38 అవార్డు, జూనియర్ ఎన్టీఆర్ 24, నాని 19, రామ్ చరణ్ 14, ప్రభాస్ 12 అవార్డులను అందుకున్నారు. ఇక వీరందరి కంటే బన్నీనే అత్యధిక అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X