Just In
- 9 min ago
KRACK వివాదం.. దిల్ రాజు గురించి మాట్లాడే అర్హతే లేదు.. బెల్లంకొండ సురేష్ కామెంట్స్
- 1 hr ago
క్రాక్ ఓటీటీ రిలీక్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రాబోతోందంటే?
- 1 hr ago
ఇన్నేళ్లకు ఆ విషయం తెలిసింది.. ఇకపై నేనేంటో చూపిస్తా.. రామ్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
సలార్ సినిమాకు హీరోయిన్ టెన్షన్.. వాళ్ళు ఖాళీగా లేరట
Don't Miss!
- News
తిరుమలలో అపచారం: ఎక్కడి నుంచి వచ్చాయో గానీ: శ్రీవారి ఆలయం వద్ద తిష్ఠ: భక్తుల అసహనం
- Sports
యువరాజ్ సింగ్ పంచుకున్న భరతనాట్యం బౌలింగ్.. చూస్తే వావ్ అనాల్సిందే!వీడియో
- Finance
startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శ్రీవారి సన్నిధిలో అల్లు అర్జున్ ఫ్యామిలీ.. వేదపండితుల అశీర్వచనం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'అల.. వైకుంఠపురములో' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మేరకు 'అల.. వైకుంఠపురములో' టీమ్ తో కలిసి ఫ్యామిలీతో సహా తిరుమల టూర్ వేశారు బన్నీ. ఆ తిరుమలేశుని సన్నిధిలో ఆశీర్వాదం పొందారు అల్లు అర్జున్- స్నేహా రెడ్డి దంపతులు. ఆ విశేషాలు చూద్దామా..

సతీసమేతంగా అల్లు అర్జున్.. శ్రీవారి దర్శనం
అల్లు అర్జున్ దంపతులు ఈ రోజు (శుక్రవారం) ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వేకువజామున నిర్వహించే అభిషేక సేవలో భాగమయ్యారు సతీసమేతంగా పాల్గొన్నారు అల్లు అర్జున్. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం తీసుకున్నారు.

బన్నీ వెంటే 'అల.. వైకుంఠపురములో' టీమ్
అల్లు అర్జున్ తిరుమల ప్రయాణంలో ఆయనతో పాటు అల వైకుంఠపురములో చిత్ర దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ, బన్నీవాసు వెళ్లారు. అంతా కలిసి శ్రీవారి ఆశీర్వాదం పొంది తీర్ధ ప్రసాదాలు పుచ్చుకున్నారు. టీటీడీ అధికారులు వీళ్లకు స్వాగతం పలికారు.

అల.. వైకుంఠపురములో గ్రాండ్ సక్సెస్.. అందుకే
అల.. వైకుంఠపురములో సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించడంతో టీం అంతా తిరుమలకి చేరుకొని మొక్కుని చెల్లించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ శ్రీవారి దర్శనం తాలూకు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి మురిసిపోతున్నారు బన్నీ అభిమానులు.

300 కోట్ల దిశగా.. ఆ ఇద్దరికీ మాంచి బూస్టింగ్
మరోవైపు 'అల.. వైకుంఠపురములో' మూవీ దేశవిదేశాల్లో నేటికీ సత్తా చాటుతోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ 250 కోట్ల గ్రాస్ దాటేసి 300 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇటు అల్లు అర్జున్‌కి, అటు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి ఈ విజయం మాంచి బూస్టింగ్ ఇచ్చింది.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్..
ఇకపోతే అల్లు అర్జున్ తన తాజా ప్రాజెక్టును సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ సినిమాలో ఆయన సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. విలక్షణ కథాంశంతో ఈ సినిమా రూపొందుతుండటం ఆసక్తికర అంశం.