నాగార్జునకు అల్లుఅర్జున్ సపోర్ట్.. థియేటర్లలో ఫ్యాన్స్ ను అలా చేయమంటూ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), టాలీవుడ్ స్టార్ హీరో, కింగ్ నాగార్జున (Nagarjuna)కు సపోర్టు చేయడమే అనుకుంటున్నారా ? అనండి బాబు.. ఇది నిజమే.. నాగార్జున సినిమా కోసం ఏకంగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అంతే కాదు.. నాగార్జున మూవీ వెళ్లేటప్పుడు తన ఫ్యాన్స్ ను రెండు లారీల పేపర్లు తీసుకెళ్లాలని సూచించారు. ఇంతకీ ఆ మూవీ ఏంటీ? నాగార్జున మూవీకి బన్నీ ప్రమోషన్స్ చేయడమేంటీ? అని భావిస్తున్నారా? అయితే.. ఆ సోర్టీ ఏంటో ఓ లూక్కేయండి.

తెలుగు సినిమా చరిత్రలో కొత్త శకానికి నాంది పలికిన సినిమాల్లో ఒకటి 'శివ'(Shiva).1989లో విడుదలైన ఈ మూవీ సెన్సేషన్ సృష్టించింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కింది. ఈ మూవీ కింగ్ నాగ్ కెరీర్‌లోనే కాదు, మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మార్పు తీసుకువచ్చింది. తాజా క్లాసిక్‌ కాల్ట్ మూవీ నవంబర్‌ 14న రీ-రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Allu Arjun Promotes Nagarjuna s Iconic Shiva Re-Release

అల్లు అర్జున్ తన వీడియోలో మాట్లాడుతూ "శివ సినిమా రిలీజ్ అయి దాదాపు 36 ఏళ్లు అవుతోంది. ఇది కేవలం తెలుగు సినిమాకే కాదు, మొత్తం భారతీయ సినిమా చరిత్రలో ఒక ఐకానిక్ మూవీ. 'శివ'వచ్చిన తర్వాతే సినిమాలు ఎలా తీయాలో, ఎలా ప్రెజెంట్ చేయాలో మారిపోయింది. టెక్నికల్‌గా, థీమ్ వైజ్‌గా ఈ సినిమా కొత్త దారిని చూపించింది," అని అన్నారు.

అదే కాకుండా బన్నీ సరదాగా మాట్లాడుతూ.. "ఈసారి శివ సినిమా రీ రిలీజ్ అవుతుందంటే, నాగార్జున గారి ఫ్యాన్స్ థియేటర్స్‌కి రెండు లారీల పేపర్లు తీసుకెళ్లాలి!" అని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్య అభిమానుల్లో జోష్ క్రియేట్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో "రెండు లారీల పేపర్స్" అనే పదం ట్రెండ్ అవుతోంది. నాగార్జున ఈ వీడియోను తన 'ఎక్స్' (X) అకౌంట్‌లో షేర్ చేస్తూ, "Dear Allu Arjun, Two Lorrys Thanks!" అని సరదాగా రిప్లై ఇచ్చారు. ఈ పోస్ట్ అభిమానుల్లో చక్కటి చర్చకు దారితీసింది.

1989 అక్టోబర్ 5న విడుదలైన 'శివ' సినిమాను రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వం వహించగా, అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) నిర్మించింది. ఇందులో నాగార్జున సరసన అమల (Amala) నటించగా, రఘువరన్ (Raghuvaran) భవాని పాత్రలో కొత్త రకం విలనిజాన్ని ప్రేక్షకుల ముందు ఉంచారు. ఇళయరాజా (Ilaiyaraaja) అందించిన సంగీతం సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది. "చిన్నా", "శుభలేఖ సుధాకర్", "సాయిచంద్" తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రం కేవలం బాక్సాఫీస్ హిట్ మాత్రమే కాకుండా, టెక్నికల్‌గా తెలుగు సినిమాకు కొత్త దిశను చూపించింది. స్టెడీక్యామ్ షాట్స్, రియలిస్టిక్ లొకేషన్స్, రఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వంటి అంశాలతో దర్శకుడు ఆర్జీవీ ఒక్క కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఈ సినిమాతో భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు తిరిగి చూసేలా చేసిందంటే అతిశయోక్తి కాదు.

'శివ'విజయంతో రామ్ గోపాల్ వర్మ హిందీ వెర్షన్ 'శివ (1990)' కూడా రూపొందించి అక్కడ సూపర్ హిట్ అందుకున్నారు. ఇలాంటి బ్లాక్ బస్టర్ కల్ట్ మూవీ 35 సంవత్సరాల తర్వాత, అత్యాధునిక టెక్నాలజీతో 4K రీ-మాస్టర్డ్ వెర్షన్ లో విడుదల కాబోతుంది. ఇక 'శివ' రీ-రిలీజ్‌ను అక్కినేని ఫ్యాన్స్ పెద్ద పండుగలా జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X