మళ్ళీ డేరింగ్ స్టెప్ తీసుకోబోతున్న అల్లు అర్జున్.. పుష్ప కోసం తగ్గేదేలే!
టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన పుష్ప రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా నేషనల్ లెవెల్లో మార్కెట్ సెట్ చేసుకోవాలని అల్లు అర్జున్ బలంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆర్య సిరీస్ అనంతరం బన్నీతో చేస్తున్న సుకుమార్ ఇలాంటి సినిమాతో వస్తాడని ఎవరు ఊహించలేదు. కంప్లీట్ యాక్షన్ ఫ్లేవర్ తో సరికొత్త కిక్కివ్వనున్నట్లు అనిపిస్తోంది.
ఇక సినిమా షూటింగ్ కరోనా కారణంగా బ్రేకులు పడుతున్న విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ ప్రభావం లేకపోయి ఉంటే ఈపాటికే సినిమా రిలీజ్ సందడి మొదలయ్యి ఉండేది. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది మళ్ళీ షూటింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఎక్కువగా జూలై నెలలోనే షూటింగ్స్ స్టార్ట్ కానున్నాయి. అయితే కరోనా మాత్రం ఇంకా తగ్గలేదు. అందరూ కాస్త రిస్క్ అయినా కూడా జాగ్రత్తలు తీసుకొని షూటింగ్స్ చేయాలని అనుకుంటున్నారు. ఇక పుష్ప టీమ్ కూడా డేర్ చేయడానికి సిద్ధమైంది. షూటింగ్ స్పీడ్ పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

జూలై 5న నెక్స్ట్ షెడ్యూల్ ను మొదలు పెట్టె అవకాశం ఉందట. ఇక ఆ షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన్న బిజీబిజీగా పాల్గొననున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని పుష్ప పార్ట్ 1ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక సెకండ్ పార్ట్ ను మాత్రం బన్నీ ఐకాన్ తరువాత రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. అలాగే సుకుమార్ కూడా మధ్యలో విజయ్ దేవరకొండ సినిమాను కూడా పూర్తి చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











