For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తండ్రి చనిపోతే కొద్ది రోజులే ఆ ప్రేమ.. అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో అల్లు అర్జున్ ఎమోషనల్

  |

  తెలుగు సినిమా పరిశ్రమకు తలమానికంలా నిలిచే మరో సినీ స్టూడియోకు అల్లు ఫ్యామిలీ అంకురార్పణ చేశారు. ప్రఖ్యాత నటుడు, పద్మశ్రీ స్వర్గీయ శ్రీ అల్లు రామలింగయ్య గారి జ్ఞాపకంగా, మధురసృతిగా అల్లు స్టూడియోను హైదరాబాద్‌లో చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ వేడుకలో చిరంజీవితోపాటు అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ..

  మా తాత కలను సాకారం చేస్తూ

  మా తాత కలను సాకారం చేస్తూ

  అందరికి నమస్కారం. వెల్‌కమ్ టు అల్లు స్టూడియోస్. ఇక్కడకు వచ్చి అల్లు స్టూడియో ప్రారంభోత్సవం చేసిన మెగాస్టార్ చిరంజీవికి నా కుటుంబ తరుఫున సభ నుంచి థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను. ఈ రోజు మా తాత గారి 100వ పుట్టిన రోజు. మాకు స్పెషల్ డే. .. అల్లు అరవింద్ పెద్ద నిర్మాత. వారికి చాలా భూమి ఉంటుంది. స్టూడియో పెట్టడం పెద్ద లెక్క కాదు అని అందరూ అనుకోవచ్చు. పెద్ద విశేషం కాదని అనుకొవచ్చు. కానీ మాకు కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందని ఈ స్టూడియో పెట్టలేదు. ఈ స్టూడియో పెట్టడం వెనుక కారణం మా తాత కల. ఆయన కోరికకు గుర్తుగా ఈ స్టూడియోను కడుతున్నాం అని అల్లు అర్జున్ ఎమోషనల్ చెప్పారు.

  మా తాత మరణించి 18 ఏళ్లు

  మా తాత మరణించి 18 ఏళ్లు


  సాధారణంగా ఎవరి ఇంట్లో ఫాదర్ చనిపోతే కొద్ది రోజులు గుర్తుంచుకొంటారు. మొదటి సంవత్సరం చేసినంతగా ఫంక్షన్ మరో సంవత్సరం చేయరు. ఆయా కుటుంబాలు పరిస్థితిని బట్టి తండ్రి గుర్తుంచుకొని వేడుకలు చేస్తుంటారు. నేను ఎవరిని కించపరచడానికి ఈ మాటలు అనడం లేదు. కానీ మా తండ్రి విషయానికి వస్తే.. ఆయన తండ్రిపై ప్రతీ సంవత్సరం ఆ ప్రేమ, అభిమానం పెరుగుతూనే ఉంది. ఆయన మరణించి 18 ఏళ్లు గడిచినా గానీ.. ప్రేమ తరగకపోగా.. పెరిగిపోతున్నది అని అల్లు అర్జున్ అన్నాడు.

  మాతాతపై ప్రేమను కురిపిస్తున్న నాన్నకు

  మాతాతపై ప్రేమను కురిపిస్తున్న నాన్నకు


  మా తాతను మా తండ్రి ప్రేమించే విషయం చేస్తే నాకు ముచ్చటేస్తుంది. మా తాతపై ఇంతటి ప్రేమను కురిపిస్తున్న మా నాన్నకు ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. ఈ స్టూడియో ప్రారంభ వేడుకను జరపడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో.. ఎన్నో దశాబ్దాల నుంచి ప్రేమ కురిపిస్తున్న మెగా అభిమానులు, అలాగే నాపై అభిమానాన్ని కురిపిస్తున్న నా ఆర్మీకి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను అని అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు.

   మాకు ప్రత్యేకమైన దినం

  మాకు ప్రత్యేకమైన దినం

  అల్లు స్టూడియో ప్రారంభ వేడుకకు వచ్చిన మా స్నేహితులు, సన్నిహితులు, నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. మా తాత అంటే ప్రతీ ఒక్కరి కళ్లలో ప్రేమ కనిపిస్తున్నది. ఈ రోజు మాకు ప్రత్యేకమైన దినం. మాకు ఎప్పుడూ సపోర్టుగా నిలిచిన మీడియా, పోలీసు వారికి మా ధన్యవాదాలు అని అల్లు అర్జున్ భావోద్వేగానికి లోనయ్యారు.

  అల్లు అరవింద్ ఎమోషనల్ స్పీచ్

  అల్లు అరవింద్ ఎమోషనల్ స్పీచ్


  అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మా నాన్నగారు చనిపోయి సుమారు 18 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటికీ ప్రతీ ఇంటా ఒక ఈటీవీలోనో, జెమిని టీవీలోనో కనిపిస్తారు. ఇంకా స్టూడియో అనేది ఎంత లాభాన్ని తీసుకొస్తుంది, ఎంత వ్యాపారం అనే దృక్పథంతో కట్టలేదు. ఈ స్టూడియో తరాలుగా ఉండిపోయే ఒక జ్ఞాపిక, ఇది ఒక సొంత స్పెసిలిటీ, ఇకపై స్టూడియో కాని గీతా ఆర్ట్స్ కాని పైనుంచి చూస్తాను. నా బాధ్యతలను నా తర్వాత తరానికి అప్పగిస్తాను. వీరంతా దీనిని దిగ్విజయంగా నడిపిస్తారు అని ఆశిస్తున్నాను అని అల్లు అరవింద్ అన్నారు.

  English summary
  Late Allu Ramalingaiah's Centernary celebrations held in Hyderabad. In this occasion, Allu family has openend Allu Studio at Hyderabad. Here is the Allu Arjun's emotional speech.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X