Allu Arjun pushpa వేరే లెవల్.. ఒక్క ట్వీట్ తో పండగ చేస్తున్న బన్నీ ఫాన్స్!

అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ప్రస్తుతం పుష్ప యూనిట్లో చాలా మంది డెంగ్యూ బారిన పడినట్టు వార్తలు వస్తుండటంతో ఈ సినిమా షూటింగ్ అయితే ప్రస్తుతానికి నిలిచిపోయిందని అంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి పెద్ద అప్డేట్స్ ఏవీ రావడం లేదని ఫాన్స్ ఒక పక్క బాధలో ఉన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ డిజిటల్ పీఆర్వో శరత్ చంద్ర ఒక ట్వీట్ తో సినిమా మీద ఆసక్తి పెంచేస్తున్నారు.

''పుష్ప పాటలు మీ ప్లే లిస్ట్ లో చాలా కాలం ఉండి పోవడం ఖాయం, దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన చార్ట్ బస్టర్ సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అల్లు అర్జున్ తగ్గేదేలా, అంటూ ఆయన ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.. చాలాకాలం పాటు సరైన సాంగ్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన దేవిశ్రీప్రసాద్ ఉప్పెన సినిమాతో మళ్ళీ లైన్లోకి వచ్చాడు. ఈ సినిమాలో దాదాపు అన్ని సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి.. ఇప్పుడు అల్లు అర్జున్ పిఆర్ఓ చేసిన ఈ ట్వీట్ తో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది అని చెప్పక తప్పదు. నిజానికి ఆర్య, ఆర్య 2 రెండు సినిమాలలో దేవి శ్రీ ఇచ్చిన సాంగ్స్ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.

Allu Arjun’s Fans full happy on pushpa latest update

దీంతో ఈ సినిమా సాంగ్స్ మీద కూడా ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నాడు. అది కూడా మొట్ట మొదటి సారి ఈ సినిమాలో డిగ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా మొత్తం సాగుతోంది. షూటింగ్ కూడా దాదాపుగా ఎక్కువగా అడవుల్లో చేస్తున్నారు.. ఎక్కువగా అడవుల్లో షూటింగ్ చేస్తున్న నేపథ్యంలో దోమలు కుట్టడంతో చాలా మంది యూనిట్ సభ్యులు డెంగ్యూ బారిన పడ్డారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న కూడా డెంగ్యూ బారిన పడినా పెద్దగా ఇబ్బంది లేదని వారు కోలుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లభించలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X