‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీకి అల్లు అర్జున్ ఫిదా!
నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ'. స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ మూవీని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. జూన్ 21న విడుదలవ్వగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
తాజాగా ఈ చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వీక్షించారు. ఈ మూవీపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రం చూశాను. కామెడీతో కూడిన మంచి థ్రిల్లర్. కొత్త టాలెంటుతో కూడిన న్యూ జనరేషన్ యాక్టర్లు, డైరెక్టర్లు తెలుగు సినిమా పరిశ్రమలోకి రావడం ఆనందంగా ఉంది. చిత్ర బృందానికి అభినందనలు. థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడే వారు తప్పకుండా చూడండి' అని ట్వీట్ చేశారు.

ఈ చిత్రం విడుదలైన 4 రోజుల్లోనే రూ. 6 కోట్ల గ్రాస్ వసూలు చేసి ప్రాఫిట్ జోన్లోకి వెళ్లింది. సినిమా నిర్మాతలు తమ పెట్టుబడి రికవరీ చేసుకోవడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా సేఫ్ జోన్లోకి వెళ్లారు. రెండో వారంలో సైతం ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబట్టింది.
విజయ్ దేవరకొండతో కలిసి థియేటర్ ఆర్ట్స్ చేయడంతో పాటు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించిన నవీన్ పొలిశెట్టికి హీరోగా ఇది తొలి చిత్రం. తన స్నేహితుడి సినిమాను ప్రమోట్ చేయడానికి విజయ్ దేవరకొండ కూడా ఇటీవల ప్రెస్ మీట్‌కు హాజరైన సంగతి తెలిసిందే.
ఇపుడు స్వయంగా అల్లు అర్జున్ నుంచి ప్రశంసలు రావడంతో మెగా ఫ్యామిలీ అభిమానులు సైతం ఈ చిత్రంపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం బాక్సాఫీసు బరిలో సమంత మూవీ 'ఓ బేబీ' ఉంది. మరి దీన్ని నవీన్ పొలిశెట్టి చిత్రం ఏమేరకు తట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











