Don't Miss!
- News
ఫిబ్రవరి 10నుండి తెలంగాణా వీధుల్లో బీజేపీ జజ్జనకరి జనారే!!
- Finance
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Allu Arjun : ఇద్దరు మామల చేతుల మీదుగా బన్నీకి సన్మానం.. ఎందుకంటే?
పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతానికి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పుష్ప సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాక ఎప్పుడో డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా మానియా ఇంకా జనాల్లో కనిపిస్తూనే ఉంది. సామి సామి, ఊ అంటావా మావా, ఊహూ అంటావా మావా అనే పాటలు జనం నోళ్ళలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజా గా అల్లు అర్జున్ కి సన్మానం జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే

పార్క్ హయత్ హోటల్ లో ఘనంగా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిన సందర్భంగా ఆయనకు సన్మానం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం శనివారం పార్క్ హయత్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం అల్లు స్నేహ రెడ్డి తండ్రి డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని సమాచారం.

చిరంజీవి గజమాలతో
అయితే ఇక సన్మాన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, కేంద్ర మాజీ మంత్రి టి సుబ్బిరామిరెడ్డి , మాజీ పీఎంవో చీఫ్ సెక్రటరీ భాను ప్రకాష్, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, క్రిష్, గుణశేఖర్ లు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ అల్లు అర్జున్ ను గజమాలతో సత్కరించారు.

ఏప్రిల్ 25 నుంచి షూటింగ్
ఇక పుష్ప సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి పుష్ప 2 పైనే ఉంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుకుమార్ సహా ఆయన రచయితల బృందం ఈ సినిమా రెండవ భాగం బౌండ్ స్క్రిప్ట్‌ను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ చివరి వారం అంటే ఏప్రిల్ 25 నుంచి షూటింగ్ ప్రారంభించాలని సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

లొకేషన్ సెర్చ్‌లో బిజీగా
మరో టీమ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అడవుల్లోని వివిధ ప్రాంతాల్లో లొకేషన్ సెర్చ్‌లో బిజీగా ఉందని అంటున్నారు. ఇక అలాగే ఆర్టిస్టుల డేట్స్ కోసం వారితో సమన్వయం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఎందుకంటే పుష్ప 2, సహా తలపతి విజయ్ - వంశీ పైడిపల్లి సినిమాల కోసం రష్మిక తన డేట్స్ సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.

పుష్ప 2ని భారీగా
ఇక ఆంధ్ర ప్రదేశ్ సహా యునైటెడ్ స్టేట్స్ మినహా పుష్ప సూపర్ హిట్ గా నిలిచింది. ఆంద్రప్రదేశ్‌లో టిక్కెట్టు ధరలు భారీగా తగ్గించడంతో సినిమా దారుణంగా దెబ్బతింది. అయితే, ఇది ఉత్తర భారత మార్కెట్లలో ఆశ్చర్యకరంగా మంచి పనితీరును కనబరిచింది. ఈసారి బాలీవుడ్‌ను దృష్టిలో పెట్టుకుని పుష్ప 2ని భారీగా తెరకెక్కించేందుకు భారీ ప్లాన్‌లు జరుగుతున్నాయి.
ఇక అలాగే రాజమౌళి దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేయాలని అనుకున్నట్టు ప్రచారం జరిగింది కానీ దాని మీద ఎలాంటి క్లారిటీ లభించలేదు. ఇక ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నట్టు ప్రచారం జరిగింది.