»   » రవితేజ్ గెటప్స్ అదుర్స్: ‘అమర్ అక్భర్ ఆంటోనీ’ ఫస్ట్ లుక్ వచ్చేసింది!

రవితేజ్ గెటప్స్ అదుర్స్: ‘అమర్ అక్భర్ ఆంటోనీ’ ఫస్ట్ లుక్ వచ్చేసింది!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Amar Akbar Anthony Movie First Look Released

  రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్నచిత్రం 'అమర్ అక్భర్ ఆంటోనీ'. ఇలియానా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో రవితేజ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూడు పాత్రలకు సంబంధించిన లుక్ రివీల్ చేస్తూ సోమవారం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే రవితేజ మరోసారి తనదైన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులకు వినోదం పంచబోతున్నాడని స్పష్టమవుతోంది. మాస్ మహరాజ్ తన కెరీర్లో తొలిసారిగా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతుండటం మరో విశేషం.

  శ్రీను వైట్ల, రవితేజ కెరీర్లోనే డిఫరెంట్ మూవీ

  శ్రీను వైట్ల, రవితేజ కెరీర్లోనే డిఫరెంట్ మూవీ

  రవితేజ-శ్రీను వైట్ల కాంబినేషన్లో గతంలో చాలా హిట్ సినిమాలు వచ్చాయి. అయితే ఆ చిత్రాలకు భిన్నంగా... పూర్తిగా డిఫరెంట్ కథ, కొత్త జోనర్లో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో రవితేజ డిఫరెంట్ గెటప్స్ ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచాయి.

  కీలక పాత్రల్లో లయ, సునీల్

  కీలక పాత్రల్లో లయ, సునీల్

  ఈ మూవీలో కీలక పాత్రల్లో ఒకప్పటి హీరోయిన్ లయ, సునీల్ నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో వెన్నెల కిషోర్, రఘుబాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ కనిపించబోతున్నారు.

   యూఎస్ఏలో

  యూఎస్ఏలో

  ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ యూఎస్ఏలోని న్యూయార్క్ లో జరుగుతోంది. సెప్టెంబర్ రెండో వారంలో ఇక్కడ షెడ్యూల్ పూర్తి కాబోతోంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ‘మైత్రి మూవీ మేకర్స్' నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.

  నటీనటులు, టెక్నీషియన్స్

  నటీనటులు, టెక్నీషియన్స్

  ఈ చిత్రంలో రవితేజ, ఇలియానా, సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవి ప్రకాష్, తరుణ్ అరోరా, రఘు బాబు, అభిమన్యు సింగ్, ఆదిత్య మీనన్, విక్రమ్ జిత్, రాజ్ వీర్ సింగ్, షియాజీ షిండే, శుభలేఖ సుధాకర్ నటిస్తున్నారు.

  స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: శ్రీను వైట్ల
  నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి
  సహ నిర్మాత: ప్రవీణ్ మర్పూరి
  సీఈఓ: చెర్రీ
  సినిమాటోగ్రీఫీ: విజయ్ సి దిలీప్
  సంగీతం: ఎస్ఎస్ థమన్
  ఎడిటర్: ఎంఆర్ వర్మ
  ఆర్ట్: ఎఎస్ ప్రకాష్
  లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి

  English summary
  The first look poster of ‘Amar Akbar Anthony’ is released by the makers. Starring Ravi Teja and Ileana in the lead roles, the first look has the protagonist in three different gets ups. It’s an interesting look as Ravi Teja is seen in multiple shades for the first time. Sreenu Vaitla is directing ‘Amar Akbar Anthony’ and the film is being made with a completely different plot and genre.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more