For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ టీజర్ అదుర్స్: రవితేజ ఈసారి హిట్టుకొట్టేలా ఉన్నాడు!

  |
  Amar Akbar Anthony Teaser

  'మనకు నిజమైన ఆపద వచ్చినపుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలంకాదు... మనలో ఉన్న బలం' అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మాస్ మహరాజా రవితేజ. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' టీజర్ విడుదలైంది.

  ఇలియానా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో రవితేజ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూడు పాత్రలకు సంబంధించిన లుక్ రివీల్ చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ముఖ్యంగా టేకింగ్ చాలా బావుందనే ఫీలింగ్ కలుగచేస్తోంది.

  ముగింపు రాసుకున్న తర్వాతే కథ మొదలు పెట్టాలి

  ముగింపు రాసుకున్న తర్వాతే కథ మొదలు పెట్టాలి

  ముగింపు రాసుకున్న తర్వాతే కథ మొదలు పెట్టాలి... అంటూ మొదలైన ఈ మూవీ టీజర్ చూస్తుంటే సినిమా ఒక సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. లుక్స్ పరంగా రవితేజ సూపర్బ్ అనేలా కనిపించాడు.

   వాడు ఎక్కడుంటాడో? ఎలా ఉంటాడో? ఎవరికీ తెలియదు.

  వాడు ఎక్కడుంటాడో? ఎలా ఉంటాడో? ఎవరికీ తెలియదు.

  వాడు ఎక్కడుంటాడో? ఎలా ఉంటాడో? ఎవరికీ తెలియదు... అంటూ విలన్స్ హీరో గురించి మాట్లాడుకోవడం చూస్తుంటే రివేజ్ డ్రామాగా సినిమా ఉంటుందని, అజ్ఞాతంలో ఉంటూ శత్రువులను వేటాడే పాత్రలో రవితేజ కనిపిస్తాడని తెలుస్తోంది.

  ఇలియానా లుక్ బాగా మారిపోయింది

  ఇలియానా లుక్ బాగా మారిపోయింది

  ఇలియానా తెలుగు తెరకు దూరమై చాలా కాలం అయింది. చివరగా దేవుడు చేసిన మనషులు చిత్రంలో రవితేజతో నటించిన ఇల్లీ బేబీ మళ్లీ ఆయన సినిమాతోనే టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే అప్పటికీ ఇప్పటికీ ఇలియానాలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా లుక్ పరంగా చూస్తే సన్ననడుము బ్యూటీ అనే పదం ఆమెకు ఇక సూటవ్వదేమో?

  భారీ హైప్

  భారీ హైప్

  శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన 'మైత్రి మూవీ మేకర్స్' నుండి వస్తున్న సినిమా కావడం... గతంలో శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్లో హిట్ సినిమాలు వచ్చిన నేపథ్యంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ'పై హైప్ మరింత పెరిగింది.

  అమర్ అక్బర్ ఆంటోనీ

  నవంబర్ 16న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ, ఇలియానా, సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవి ప్రకాష్, తరుణ్ అరోరా, రఘు బాబు, అభిమన్యు సింగ్, ఆదిత్య మీనన్, విక్రమ్ జిత్, రాజ్ వీర్ సింగ్, షియాజీ షిండే, శుభలేఖ సుధాకర్ నటిస్తున్నారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: శ్రీను వైట్ల, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి, సహ నిర్మాత: ప్రవీణ్ మర్పూరి, సీఈఓ: చెర్రీ, సినిమాటోగ్రీఫీ: విజయ్ సి దిలీప్, సంగీతం: ఎస్ఎస్ థమన్, ఎడిటర్: ఎంఆర్ వర్మ, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి.

  English summary
  Amar Akbar Anthony movie teaser Released. Starring Ravi Teja and Ileana in the lead roles, the first look has the protagonist in three different gets ups. It’s an interesting look as Ravi Teja is seen in multiple shades for the first time. Sreenu Vaitla is directing ‘Amar Akbar Anthony’ and the film is being made with a completely different plot and genre.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X