twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpa in Amazon Prime: ముందే వచ్చినా నిరాశలో ఫాన్స్.. ఎందుకో తెలుసా?

    |

    అల్లు అర్జున్ హీరోగా వచ్చి థియేట్రికల్ విడుదలైన పుష్ప ది రైజ్, ఈరోజు అంటే శుక్రవారం నాడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ చేయబడింది. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం వెర్షన్‌లను ఇప్పుడు ప్లాట్‌ఫారమ్‌లో చూడవచ్చు. అయితే ఆనంద పడాల్సిన ఫాన్స్ కాస్త నిరుత్సాపడుతున్నారు. ఆ వివరాలు

    Recommended Video

    OTT vs Theatres : ప్రేక్షకుల మూడ్ బట్టి సినిమాలు ఆడుతున్నాయి | Tollywood || Filmibeat Telugu
     అద్భుతమైన కలెక్షన్స్

    అద్భుతమైన కలెక్షన్స్

    అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. సుమారు అన్ని భాషల్లో కలిపి 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది అంటే పుష్ప జనాన్ని ఈమేరకు ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. కరోనా సమయంలో కూడా బాక్సాఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ రాబట్టి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించాడు అల్లు అర్జున్.

     లాభాలు తెచ్చిపెట్టి

    లాభాలు తెచ్చిపెట్టి

    ఇక తెలుగులో మాత్రమే కాక హిందీలో కూడా సత్తా చాటింది ఈ సినిమా. ఇక తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా పుష్ప సినిమాకు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి. అసలు ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించాను కూడా ఊహించలేదు. అయితే బయట భాషల్లో సినిమా కొన్న వాళ్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమా ఏపీ, తెలంగాణలో కొన్ని చోట్ల నష్టాలూ వచ్చాయి.

     భారీ రేట్లకు

    భారీ రేట్లకు


    ఈ సినిమాను దాదాపు రూ.102 కోట్లకు అమ్మారు నిర్మాతలు. అల్లు అర్జున్ గత సినిమా అల వైకుంఠపురంలో తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్లకు పైగా వసూలు చేసిన క్రమంలో ఈ సినిమా కూడా మంచి వసూళ్లు రాబడుతుందనే నమ్మకంతో పుష్ప సినిమాను భారీ రేట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అయితే సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఊహించిన మేర కలెక్షన్స్ రాలేదు. నైజాంలో సినిమా జస్ట్ సేఫ్ అయింది కానీ లాభాలు అయితే రాలేదు.

     పరిస్థితి దారుణంగా

    పరిస్థితి దారుణంగా

    ఇక ఏపీలో టికెట్ల వ్యవహారం రీత్యా పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ టికెట్ రేట్లు ప్రభుత్వం భారీగా తగ్గించడంతో ఆ ప్రభావం కలెక్షన్స్ మీద పడడమే కాక పడింది. 60 కోట్లు పెట్టి సినిమా కొంటే ఇప్పటి దాకా రూ. 42 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే దాదాపు 17 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయని అంటున్నారు. ఇక ఈరోజు నుంచి పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతున్న క్రమంలో వారికి నష్టాలు తీర్చేందుకు డబ్బులు కూడా చెల్లించినట్టు వార్తలు వచ్చాయి.

     అభిమానులు ఆశించారు, కానీ

    అభిమానులు ఆశించారు, కానీ

    ఆ సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్ అభిమానులకు ఒక పెద్ద నిరాశే మిగిలింది. చాలా మంది ఆశించినట్లుగా, అమెజాన్ ప్రైమ్ చిత్రం యొక్క అన్‌కట్ వెర్షన్‌ను విడుదల చేయలేదు. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతున్న వెర్షన్‌లో, తొలగించబడిన ఒక సీన్ మాత్రమే జోడించబడింది. భారతదేశంలో ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సన్నివేశం ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదలైంది. కాబట్టి, ఇందులో కొత్తేమీ లేదు. అమెజాన్ ప్రైమ్ పూర్తి-నిడివి గల అన్‌కట్ వెర్షన్‌ను విడుదల చేస్తుందని అల్లు అర్జున్ అభిమానులు ఆశించారు, కానీ అది జరగలేదు. కేవలం థియేట్రికల్ కాపీ మాత్రమే ఇప్పుడు అమెజాన్‌లో ప్రసారం అవుతోంది.

    English summary
    Amazon Prime Disappoints With Pushpa Uncut Version.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X