»   » పూరీ చేతుల మీదుగా అనగనగా ఓ ప్రేమకథ తొలి పాట

పూరీ చేతుల మీదుగా అనగనగా ఓ ప్రేమకథ తొలి పాట

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ అనగనగా ఓ ప్రేమకథ'' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కె.సతీష్ కుమార్ సమర్పణలో టి.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్, రాధా బంగారు నటిస్తున్నారు. సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్ గా పేరుపొందిన నిర్మాత కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

  ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ "నిన్ను విడవను లే " డాషింగ్ డైరెక్టర్ " పూరి జగన్నాధ్ " విడుదల చేశారు .

  Anaganaga o premakatha first song launched by Puri Jagannadh

  డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడుతూ " ప్రొడ్యూసర్ కె.ఎల్.యన్.రాజుతో అమ్మ నాన్న తమిళ అమ్మాయి చిత్రానికి పని చేశాను. మళ్ళీ అయన తో సినిమా చేయాలనుకున్న కానీ రాజు గారు ఇతర బిజినెస్‌లో బిజీ అయిపోయారు. మళ్ళీ చాలా రోజులు తరవాత 'అనగనగ ఓ ప్రేమకథ' అనే సినిమాను నిర్మించారు. నాకు చాలా ఆనందంగా ఉంది , మార్తండ్ కే వెంకటేష్ మేనల్లుడు విరాజ్ అశ్విన్ హీరో గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. మార్తాండ్ కే వెంకటేష్తో నాకు మంచి అనుబంధం ఉంది. తప్పకుండా విరాజ్ అశ్విన్ మంచి హీరో అవుతాడు అని నమ్మకం ఉంది. డైరెక్టర్ ప్రతాప్ కి బెస్ట్ విషెస్ చెపుతూ ఈ సినిమా నీకు హిట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను అని మాట్లాడారు .

  తమ చిత్రం తొలి పాటను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు.

  Anaganaga o premakatha first song launched by Puri Jagannadh

  ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు.

  ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు: శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ
  నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు
  కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి

  English summary
  A feel good love story Movie titled “Anaganaga o premakatha” is produced by K .L.N RAJU , and Presented by K. Satish Kumar, Introducing, Viraj J Ashwin as the Hero and Riddhi Kumar as Heroine under the banner THOUSAND LIGHTS MEDIA PVT LTD. This Film is Directed by Pratap Tatamsetti. Viraj Ashwin is Nephew of Popular Editor Marthand K Venkatesh. First song titled” nine vidvanu le” was launched by Dashing director Puri Jaganadh
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more