Anand Deverakonda's Baby.. రోజాపూల రెక్కల్లో ముద్దుగుమ్మ.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?
హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం బేబి. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు SKN, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కలర్ ఫోటోతో జాతీయ అవార్డు అందుకొన్న సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొంటున్నది. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బేబీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నవంబర్ 21 తేదీన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా టీజర్ రిలీజ్‌కు ముందు పోస్టర్‌ను విడుదల చేశారు. రోజా పూల రెక్కల్లో హీరోయిన్ వైష్ణవి భావోద్వేగంతో ఉన్నట్లు పోస్టర్‌ను డిజైన్ చేశారు. ప్రస్తుతం పోస్టర్ డిఫరెంట్‌గా అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతీ పోస్టర్ సినిమా టీజర్‌పై అంచనాలు పెంచాయి. న్యూ ఏజ్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న బేబీ మూవీ సినీ అభిమానుల్లో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌ను పెంచింది.

నిర్మాత: ఎస్కే ఎన్, మారుతి
నిర్మాణ సంస్థ: మాస్ మూవీ మేకర్స్
రచన, దర్శకత్వం: సాయి రాజేష్
సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఎడిటింగ్: విప్లవ్
ఆర్ట్: సురేష్
సహా నిర్మాత: ధీరజ్ మోగిలినేని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దాసరి వెంకట సతీష్
పీఆర్వో: ఏలూరు శీను & జి. ఎస్. కే మీడియా
కొరియోగ్రఫీ:పొలాకి విజయ్.


Click it and Unblock the Notifications











