‘హైవే‘పై స్పీడ్ పెంచిన ఆనంద్ దేవరకొండ.. గుహన్ దర్శకత్వంలో సైకో థ్రిల్లర్!
వరుస విజయాలను ఖాతాలో వేసుకొంటూ విభిన్న కథా చిత్రాలను ఎంచుకొంటూ దూసుకెళ్తున్న యువ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం హైవే. ఏ నర్వ్ వ్రెకింగ్ రైడ్ స్టోరి అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. రోడ్ ట్రావెల్‌తో సాగే సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకట్ తలారి నిర్మాత. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా 'హైవే' చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ జంటగా ఉన్న ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది.
చిత్ర నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ.. గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా హైవే చిత్రం రూపొందుతున్నది. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. వారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. హైవే సక్సెస్‌ఫుల్ థ్రిల్లింగ్ మూవీ అవుతుందని విశ్వసిస్తున్నాం అని అన్నారు.

చిత్ర దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ.. నా కెరీర్‌లో నేను దర్శకత్వం వహిస్తున్న మూడో చిత్రం హైవే టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. సైమన్ కె. కింగ్ సంగీతం ఈ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్ అని అన్నారు.
తారాగణం: ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్
నిర్మాత: వెంకట్ తలారి
బేనర్: శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్
సంగీతం: సైమన్ కే కింగ్


Click it and Unblock the Notifications











