Just In
- 2 min ago
ఫైనల్ గా డ్రీమ్ ప్రాజెక్టును మొదలు పెట్టిన హీరో నిఖీల్!
- 7 min ago
వాటికి నువ్ అర్హుడివే.. ‘పొగరు’పై ప్రశాంత్ నీల్ కామెంట్స్
- 20 min ago
అయ్యో పాపం.. నితిన్ మీద ఎక్కబోయి కింద పడిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్!
- 46 min ago
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
Don't Miss!
- News
భారత్‌లో రెండో రోజూ భారీగా పెరిగిన కరోనా కేసులు: 16వేలకు పైగానే, మరణాలు పెరిగాయి
- Sports
పిచ్‌ను నిందించిన మాజీ క్రికెటర్లపై అశ్విన్ పరోక్ష వ్యాఖ్యలు!
- Finance
గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ వార్తలను ఖండించిన అనసూయ.. మంచి చేయడంపై ఫోకస్ పెట్టండి.. మీడియాకు డైరెక్షన్
యాంకర్ అనసూయ, సుమ, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలపై జీఎస్టీ అధికారులు రైడ్ చేశారని వార్తలు వైరల్ అయ్యాయి. వీరంతా ప్రైవేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు గడించారని, అయితే వాటికి సంబంధించిన జీఎస్టీ పన్నులను మాత్రం చెల్లించడం లేదని వార్తలు వచ్చాయి. జీఎస్టీ అధికారులు వీరితో పాటు 23 ప్రాంతాల్లోని కొన్ని సంస్థలపై దాడులు చేసినట్టు ప్రముఖ మీడియా చానెళ్లలో వార్తలు వచ్చాయి.

ఈ వార్తలను ఖండించిన సుమ..
తనపై వచ్చిన వార్తలను ఖండించిన సుమ.. వార్తలు రాసే ముందు ఓ సారి చెక్ చేసుకోండని విన్నవించుకుంది. తప్పుడు వార్తలు రాస్తే కూడా నేరమేనని, మీడియా బాధ్యతగా వ్యవహరించాలని పోస్ట్ చేసింది. మనుషుల్లో మానవత్వం తగ్గిపోతోందంటూ కామెంట్ చేసింది.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 22, 2019 |
అనసూయ ఫైర్..
జీఎస్టీ అధికారుల రైడ్‌పై అనసూయ సైతం స్పందించింది. ఏ ఇంట్లో ఎక్కడ జరిగిందో చెప్పాలని ప్రశ్నించింది. తన ఇళ్లు బంజారా హిల్స్‌లోనే లేదని, ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలేవీ తనిఖీలు చేయలేదని క్లారిటీ ఇచ్చేసింది. తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు మీడియాకు ఏం చేయాలో చేయకూడదో డైరెక్షన్ ఇచ్చింది.

మీడియా ఉన్నది అందుకే..
‘మీడియా ఉన్నది సమాచారాన్ని అందించడానికి. మీ సొంత అభిప్రాయాలు ఇవ్వడానికి కాదు. మేము ఈ ఇండస్ట్రీలో ఉండటానికి, ఇంతటి స్థానానికి రావడానికి ఎన్నో త్యాగాలు చేశాము. మీడియా అనేది ఓ పవర్.. సమాజానికి మంచి చేయడంపై ఫోకస్ పెట్టండి.. సమాజాన్ని మంచి దారిలో నడిపేందుకు ప్రయత్నించండి. అంతేకానీ ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఒకరి పరువును, ప్రతిష్టను దిగజార్చకండి. మీరు ఏదైనా ప్రచురించేముందు నిజనిజాలు తెలుసుకుని చేయండి.. ఇదే అందరికీ నా విన్నపం.. థ్యాంక్యూ' అంటూ పోస్ట్ చేసింది.

స్పందించని లావణ్య..
జీఎస్టీ అధికారుల రైడ్స్ వార్తలపై అనసూయ, సుమ స్పందించి.. వాటిని ఖండించారు. అయితే లావణ్య త్రిపాఠి మాత్రం ఇంకా రియాక్ట్ కాలేదు. ఆ ఇద్దరు ఖండించడంతో అవి ఉట్టి గాలి వార్తలేనని అందరికీ అర్థమైంది.