ఆ హీరోతో నాలుగు రోజుల్లో ప్రేమలో పడ్డా.. అలా ఎందుకు పిలవాలి?.. సీక్రెట్స్ బయటపెట్టిన అనసూయ!

యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు వారు ఉండరు. జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమైన ఈ భామ సినిమాల్లో కూడా రాణిస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తూ లేదా ఫోటో షూట్ లు అప్లోడ్ చేస్తూ ఈ భామ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. తాజాగా ఈ భామ అసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

జబర్దస్త్ ద్వారా సూపర్ క్రేజ్

జబర్దస్త్ ద్వారా సూపర్ క్రేజ్

జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ యాంకర్ గా చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా సరే తన అందంతో ఆమె కుర్రాళ్ళని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈమెకు టెలివిజన్ లో వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంది. అయితే వచ్చిన అన్ని పాత్రలు చేయకుండా తనకు నచ్చిన పాత్రలు మాత్రమే ఈ భామ చేస్తూ ఉంటుంది.

రంగమ్మత్త

రంగమ్మత్త

సినిమాల్లో చాలా పాత్రలు చేసినా రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో గతంలో రిలీజైన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఆమె మరింత క్రేజ్ సంపాదించింది. భర్తను కోల్పోయినా ఏ మాత్రం ఆ విషయం బయటపడకుండా అందరితో కలుపుగోలుగా ఉండే మహిళ పాత్రలో నటించి చివర్లో ఏడిపించేసింది. అంత టాలెంట్ ఉంది కాబట్టే అనసూయకు వరుస సినిమా అవకాశాలు వచ్చి పడుతున్నాయి.

నాలుగు రోజుల్లోనే లవ్ లో

నాలుగు రోజుల్లోనే లవ్ లో

రంగమ్మత్త పాత్రలో ఆమె నటన నచ్చడంతో సుకుమార్ ఈ హాట్ యాంకర్ కి మళ్ళీ పుష్ప సినిమాలో అవకాశం ఇచ్చారు. అయితే ఈ భామ షూట్ కి కేవలం నాలుగు రోజులే వెళ్లిందట. ఆ తరువాత కరోనా కారణంగా షూట్ ఆగిపోయిందట.

అయితే పుష్పా షూట్ విషయాలను ఒక తాజా ఇంటర్వ్యూలో పంచుకున్న ఈ భామ కేవలం నాలుగు రోజుల్లో, అల్లు అర్జున్‌తో ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చింది. ఆయనకు పని పట్ల ఉన్న నిబద్ధత మరియు అంకితభావం చూసి తాను ఫిదా అయ్యానని ఆమె చెప్పుకొచ్చింది.

బహుముఖ ప్రజ్ఞాశాలి

బహుముఖ ప్రజ్ఞాశాలి

అల్లు అర్జున్‌ను బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్న ఆమె ఆయనకు ఎంత పేరు, ఫేం ఉన్నప్పటికీ, తన మొదటి సినిమా కోసం ఎంత కష్ట పడుతున్నాడో ఈ సినిమాకి కూడా అంతే కష్టపడుతున్నాడు అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక అల్లు అర్జున్ పాత్రతో ప్రేక్షకులు అసలు సూపర్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఇంతలో, ఆమె తన పాత్ర గురించి పెద్దగా వెల్లడించలేదు, కానీ అనసూయ మాట్లాడుతూ తన పాత్ర ఆశ్చర్యకరంగా ఉంటుందని వెల్లడించింది.

Recommended Video

Allu Arjun Family Time, Pushpa రెండు భాగాలు It's Official అంటున్న నిర్మాత || Filmibeat Telugu
రంగమ్మక్క అనొచ్చుగా

రంగమ్మక్క అనొచ్చుగా

ఇక రంగమ్మత్త పాత్ర గురించి మాట్లాడుతూ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంటే మేకప్ వేసుకుని చేయాల్సిన పాత్రను ఒక రకంగా డీ గ్లామర్ గా చూపారని ఆమె చెప్పుకొచ్చింది. అంతే కాక రామ్ చరణ్ తో నన్ను రంగమ్మక్క లేదా రంగమ్మ అని పిలిపించవచ్చు కదా అని ముందు అనిపించిందని కానీ తనకు ముందు పాత్ర నచ్చకపోయినా ఆ పాత్ర తనకు మంచి పేరు తెచ్చిందని ఆమె చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X