For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పుష్ప సినిమా నుంచి అనసూయ లుక్స్ లీక్.. వామ్మో ఇలా ఉందేంటి, ఆడేసుకుంటున్న నెటిజన్లు!

  |

  టెలివిజన్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ నటిగా మారతానని అనుకున్నారో లేదో తెలియదు కానీ, ఇప్పుడు ఆమె నటిగా బిజీ అవుతోంది. ఆమెను దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఏకంగా సినిమాలు ప్లాన్ చేసుకుంటుంటే, మరికొంత మంది దర్శకులు తమ సినిమాల్లో ఆమెకు మంచి పాత్రలు ఇస్తున్నారు. అయితే ఆమె ఇప్పుడు పుష్ప సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ ఉండగా ఆ సినిమా నుంచి ఆమె లుక్ లీక్ అయింది. ఈ లీక్డ్ పిక్ విషయంలో పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

   సినిమాల్లో ఎంట్రీ

  సినిమాల్లో ఎంట్రీ

  ముందు ఒక న్యూస్ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనూసుయ ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ చానల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ యాంకర్ గా చాలా క్రేజ్ తెచ్చుకుంది.. ఒకానొక సమయంలో గురువారం వస్తుందంటే అనసూయని చూడడానికి సైతం చాలామంది జబర్దస్త్ ప్రోగ్రాం చూసే వాళ్ళు అంటే అతిశయోక్తి కాదు. ఈమెకు టెలివిజన్ లో వచ్చిన క్రేజ్ ను సినిమా నిర్మాతలు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆమెకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో గతంలో రిలీజైన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఆమె మరింత క్రేజ్ సంపాదించింది. చలాకీ పాత్రలో నటించి ఆమె చివర్లో ఏడిపించింది. నటిగా మంచి టాలెంట్ ఉంది కాబట్టే అనసూయకు వరుస సినిమా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఆమె వయసుకు తగ్గ రోల్స్ ఇస్తూ నిర్మాతలు కూడా ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు.

  ముందు తక్కువే

  ముందు తక్కువే

  అనసూయ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో మంచి క్రేజ్ దక్కించుకున్న కారణంగా అనసూయ కోసం సుకుమార్ మరోసారి పుష్ప సినిమాలో ఒక పాత్రను క్రియేట్ చేశారు. అయితే నిజానికి పుష్ప సినిమాలో అనసూయకి ఇచ్చింది చిన్న పాత్రే. ఈ సినిమాలో సునీల్ భార్యగా ఆమె కేవలం ఒక మూడు నాలుగు సీన్స్ లో మాత్రమే కనిపిస్తుందని ముందు అనుకున్నారు.

   రెండు భాగాలు కావడంతో

  రెండు భాగాలు కావడంతో

  పెద్దగా ప్రాధాన్యత కూడా లేని పాత్ర అనుకున్నారు కానీ పుష్ప సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ కావడంతో అనసూయ లెక్కలు మారాయి. ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆమెకు కలిసొచ్చింది. ముందు అసలు సుకుమార్ అడిగితే కాదనలేక ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్న అనసూయకు ఇప్పుడు అనూహ్యంగా అదృష్టం కలిసి వచ్చిందని ప్రచారం జరిగింది.

  పిక్ లీక్

  పిక్ లీక్

  అయితే తాజాగా ఈ సినిమాలోని అనసూయ లుక్‌ ఒకటి లీక్ అయ్యి బయటకి వచ్చింది. మామూలుగా నిండుగా జుట్టుతో జడతో కనిపిస్తూ ఉండే అనసూయ ఈ సినిమాలో మాత్రం హెయిర్‌ కటింగ్ చేసుకుని మాస్‌ లుక్‌ లో కనిపిస్తున్నారు. దీంతో ఈ లుక్ లో ఉన్న అనసూయ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ లుక్ కాస్త తేడాగా ఉండడంతో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అనసూయ లుక్‌పై కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఈమె అసలు అనసూయేనా అంటూ కొందరు మీమర్స్ క్రియేట్‌ చేసిన మీమ్స్‌ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఈ పిక్ లీక్ కావడంతో యూనిట్ జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. రంగంలోకి దిగి ఆ పిక్స్ అన్నిటినీ తీయించే పనిలో ఉన్నారని అంటున్నారు.

  లాల్ సింగ్ చద్దాతో ఢీ

  లాల్ సింగ్ చద్దాతో ఢీ

  అల్లు అర్జున్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప: ది రైజ్ విడుదల తేదీ కూడా తాజాగా ప్రకటించబడింది. ఈ సినిమా మొదటి భాగాన్ని క్రిస్మస్ 2021 లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. రెండవ భాగం 2022 లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు .ఇంత మంది స్టార్ క్యాస్ట్ ఉండడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన వెంటనే అల్లు అర్జున్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ పాన్ ఇండియా చిత్రం ద్వారా ఐకాన్ స్టార్ అల్లు అజున్ మరోసారి సుకుమార్ మరియు మ్యూజిక్ మ్యాస్ట్రో దేవి శ్రీ ప్రసాద్‌తో కలిసి పని చేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం క్రిస్మస్ రోజున, అమీర్ ఖాన్ చిత్రం లాల్ సింగ్ చద్దా కూడా విడుదల కాబోతోంది. అమీర్ ఖాన్- నాగచైతన్య తదితరులు నటిస్తున్న ఈ సినిమాలు రెండూ బాక్సాఫీస్ వద్ద ఢీకొనబోతున్నాయన్న మాట.

  Recommended Video

  Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Anasuya is now playing a key role in the movie Pushpa. her look has been leaked from the movie. There is a large scale troll going on in the case of this leaked pick.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X