Don't Miss!
- News
Astrology: అక్కడ పుట్టుమచ్చలు ఉంటే అదృష్టమేనటా..!
- Finance
Indian iphone: ప్రతి నాలుగు ఐఫోన్లలో ఒకటి భారత్ లోనే తయారీ.. ??
- Automobiles
హైవేపై అందంగా రీల్ చేసిన చిన్నది: కట్ చేస్తే రూ. 17,000 ఫైన్.. కారణం మాత్రం ఇదే
- Sports
India Playing XI: పృథ్వీ షా రీ ఎంట్రీ.. న్యూజిలాండ్తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Anasuya: ఉమెన్స్ డే కాదు 'హ్యాపీ ఫూల్స్ డే'.. యాంకర్ అనసూయ ట్వీట్.. ఆడుకుంటున్న నెటిజన్లు
ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని మహిళలు అందరూ చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అయితే ఏకంగా తెలంగాణలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగస్తులలో ఉన్న మహిళలు అందరికీ ప్రత్యేక సెలవు ప్రకటించింది కూడా. మహిళా దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తమ తమ సోషల్ మీడియా ఖాతాల వేదికగా ద్వారా వెల్లడిస్తున్నారు. ఈ సమయంలో అనసూయ చేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది. సాధారణంగా వివాదాస్పద ట్వీట్ లు చేస్తూ ఉండే అనసూయ మహిళా దినోత్సవం కాదు ఫూల్స్ డే అన్నట్టు ట్వీట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

విపరీతమైన క్రేజ్
న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా మారిన అనసూయ జబర్దస్త్ కారణంగా అతికొద్ది సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించింది. పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె అనతి కాలంలోనే తెలుగు యాంకర్లలో టాప్ పొజిషన్ కి వెళ్ళింది. ఆమె క్రేజ్ చూసి నిర్మాతలు కూడా ఆమెకు సినిమాలలో అవకాశాలు ఇచ్చారు.

రంగమ్మత్తగా
ముందుగా నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన అనే సినిమాలో చిన్న పాత్రలో నటించిన అనసూయ ఆ తర్వాత రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్రలో నటించి విపరీతమైన గుర్తింపు సంపాదించింది. వయస్సుకు తగ్గ పాత్ర కాకపోయినా తనదైన శైలిలో నటించి ఆమె ఆకట్టుకుంది.. ఆ తర్వాత ఆమె ప్రధాన పాత్రలో రెండు మూడు సినిమాలు వచ్చాయి కానీ అవి ఏవీ ఆమెకు పెద్దగా కలిసి రాలేదు.

దాక్షాయణిగా మారి
ఇటీవల కాలంలో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో దాక్షాయణి అనే పాత్రలో నటించి ఆమె తెలుగు ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది. ఇప్పటివరకు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఆమె పుష్ప సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది.. ఆ తర్వాత రవితేజ నటించిన ఖిలాడీ సినిమాలో కూడా ఆమె నటించిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది.

వివాదాస్పదంగా
అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే అనసూయ అడపా దడపా కొన్ని విషయాల మీద స్పందిస్తూ ట్రోల్స్ కు గురవుతుంటారు.. ఈ విషయం మీరు ఆమె చాలా సందర్భాల్లో స్పందించారు కూడా. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో మీమ్ పేజీలు, ట్రొల్ పేజిలు అన్నీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఫోటోలు అప్లోడ్ చేయడంతో ఆమె ఆ విషయం మీద కౌంటర్ ఇచ్చారు.

గౌరవించడం ప్రారంభించే రోజు
'ఓ! ప్రతి ట్రోలర్, మీమ్ మేకర్ హఠాత్తుగా మహిళలను గౌరవించడం ప్రారంభించే రోజు ఇది. 24 గంటల్లో ముగుస్తుంది. కాబట్టి మహిళలందరూ మినహాయిస్తే! హ్యాపీ ఫూల్స్ డే. గుమ్మడికాయ దొంగలను కామెంట్స్ లో చూడొచ్చు' అని పేర్కొంది. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు కొందరికి నచ్చడంతో ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. కొందరికి నచ్చకపోవడంతో ఆమెను మళ్లీ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇలా కామెంట్ చేయడం సరికాదంటూ అనసూయ పెట్టిన ట్వీట్ కు రిప్లై ఇస్తున్నారు.