Just In
- 4 min ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 57 min ago
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
- 1 hr ago
‘మాస్టర్’ డైరెక్టర్‌తో జూనియర్ ఎన్టీఆర్: కాంబినేషన్ సెట్ చేసిన ప్రముఖ నిర్మాత
- 1 hr ago
ఇంతకంటే మంచి సినిమా ఉంటుందా.. ‘మాస్టర్’పై కుష్బూ కామెంట్స్
Don't Miss!
- News
కోవాక్సిన్ టీకాలు తీసుకున్న వారు సమ్మతి పత్రంపై సంతకం .. దుష్ప్రభావం ఎదురైతే పరిహారం
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Automobiles
పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?
- Sports
మూడో సెషన్ రద్దు.. ముగిసిన రెండోరోజు ఆట!! భారత్ స్కోర్ 62/2!
- Finance
మొబైల్ నెంబర్‌కు కాల్ చేయాలంటే సున్నాను చేర్చండి, గుర్తు చేస్తున్న టెల్కోలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరో మూవీకి సీక్వెల్.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి.. 3 సినిమాలు ఆ హీరోతోనే..
టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస విజయాలను అందుకుంటున్న దర్శకులతో అనిల్ రావిపుడి ఒకరు. పటాస్ సినిమా నుంచి నాన్ స్టాప్ గా తనదైన శైలిలో అటు ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఇటు యాక్షన్ కథలను తెరకెక్కిస్తున్నాడు. బెస్ట్ కమర్షియల్ దర్శకుడిగా నిర్మాతలకు బయ్యర్లకు మంచి లాభాలను కూడా అందిస్తున్నాడు. అయితే నెక్స్ట్ F3 సినిమాతో రానున్న అనిల్ ఆ తరువాత మరో సినిమాకు కూడా సీక్వెల్ ఉంటుందని అన్నాడు.

మరింత ఆసక్తిగా..
ఈ ఏడాది అనిల్ రావిపూడి మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద అటు నిర్మాతలకు అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కు కూడా మంచి ప్రాఫిట్స్ ను అందించింది ఆ సినిమా. ఇక రానున్న రోజుల్లో అనిల్ చేయబోయే సినిమాలు మరింత ఆసక్తిగా ఉండబోతున్నట్లు అర్ధమవుతోంది.

అలా తనపై నమ్మకాన్ని పెంచుకున్న అనిల్
రైటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తరువాత కష్టపడి దర్శకుడిగా మారిన అనిల్ మొదట కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమాను చేశాడు. ఇక ఆ తరువాత చేసిన సుప్రీమ్ అనుకున్నంత రేంజ్ లో హిట్ కాకపోయినప్పటికి సినిమా పెద్దగా నష్టాలను కలిగించలేదు. ఇక రాజా ది గ్రేట్, F2 సినిమాలు దర్శకుడి పై మరింత నమ్మకాన్ని పెంచాయి. అనంతరం మహేష్ బాబు పిలిచిమరి అవకాశం ఇచ్చాడు.

మరో సినిమాకు సీక్వెల్
అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా అనంతరం అనిల్ చేస్తున్న సినిమా F3. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ కామెడీ మల్టీస్టారర్ పై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. ఇక అదే తరహాలో మరో సినిమాకు కూడా అనిల్ సీక్వెల్ ను రెడీ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పేశాడు. ఇటీవల క్రాక్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ లో అనిల్ అసలు విషయాన్ని చెప్పారు.

రవితేజతో మరో మూడు సినిమాలు
రవితేజతో ఎంతో ప్రయోగాత్మకంగా తీసిన రాజా ది గ్రేట్ సినిమాకు సీక్వెల్ ఉంటుందా లేదా అని అభిమానులు అడుగగా. తప్పకుండా ఉంటుంది. అలాగే రవితేజతో మరో మూడు సినిమాలు కూడా చేయడానికి రెడీ అవుతున్నట్లు చెప్పాడు. భవిష్యత్తులో అనిల్, మాస్ రాజా కాంబోలో మాత్రం చాలా సినిమాలు రావచ్చనే విషయంలో మొత్తానికి ఒక క్లారిటీ వచ్చింది. మరి ఆ సినిమాలతో ఎలాంటి సక్సెస్ ను అందుకుంటారో చూడాలి.