Don't Miss!
- News
లీటర్ పెట్రోల్, డీజిల్‌పై హఠాత్తుగా రూ.35 పెంపు..!!
- Sports
Australia Open 2023 విజేతగా నోవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డు సమం!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఆ హీరోయిన్‌తో అఫైర్.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏం సమాధానమిచ్చారంటే..
యాక్షన్, కామెడీని రంగరించి హిట్లు కొట్టడంలో దర్శకుడు అనిల్ రావిపూడిది డిఫరెంట్ స్టయిల్. పటాస్, రాజా ది గ్రేట్ చిత్రాలు ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దంపట్టాయి. తాజాగా వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) తెరకెక్కించాడు. ఈ సినిమా జనవరి 12న రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఓ హీరోయిన్‌తో అఫైర్ ఉన్నట్టు వస్తున్న వార్తలపై స్పందించాడు. ఆయన ఏమన్నారంటే..

గాసిప్‌లో వాస్తవం లేదని
ఓ హీరోయిన్‌తో నాకు అఫైర్ ఉన్నట్టు వస్తున్న వార్తలో వాస్తవం లేదు. నా దృష్టికి ఈ వార్త వచ్చింది. కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ సమయంలో సందర్బం వచ్చింది కాబట్టి స్పందిస్తున్నాను. మీడియాలో వచ్చే వార్తలను, గాసిప్స్‌ను తేలికగా తీసుకొంటాను అని అనిల్ రావిపూడి అన్నారు.
పాయల్ రాజ్‌పుత్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్‌లో ఉత్తమ విలన్ ఎవరు.. ఓటేసి మీరే డిసైడ్ చేయండి!

ఇండస్ట్రీలో రూమర్లు కామన్
వినోదపరమైన ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్లు సర్వసాధారణం. నేను ఎలాంటి వాడినో పరిశ్రమలో అందరికీ తెలుసు. నా మిత్రులకు, బంధువులకు కూడా తెలుసు. ఒకవేళ నేను తప్పు చేస్తే వాళ్లకు తెలుస్తుంది. మీడియాలో ఇలాంటి రాతలు రాసేవారు ఉంటారు. వాటిని చదివి ఎంజాయ్ చేసే వాళ్లు కూడా ఉంటారు. దానిని నేను పట్టించుకోను అని అన్నారు.

ఆధారాలు లేకుండా వార్తలు
ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తలు రాయడం నాకు నచ్చదు. కానీ ఎవరినీ తప్పు పట్టలేం. ప్రతీది పట్టించుకొంటూ పోతే వర్క్ మీద పట్టు కోల్పోతాం. నా పనుల్లో నేను ఉంటాను. గాసిప్స్ గురించి పట్టించుకొంటే ముందుకెళ్లలేం అని సుదీర్గమైన ఉపన్యాసమే ఇచ్చారు అనిల్ రావిపూడి.

సంక్రాంతి బరిలో ఎఫ్2 మూవీ
ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్2 చిత్రంతో సంక్రాంతి బరిలోకి దిగాడు. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్‌తోపాటు తమన్నా, మెహ్రీన్ తదితరులు నటిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్, పేట, వినయ విధేయ రామ చిత్రాలతో ఎఫ్2 పోటీ పడనున్నది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు వినోదం పంచే సినిమాగా ఎఫ్2 ఇప్పటికే పేరు సంపాదించుకొన్నది.