తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాతే షూటింగ్ యూనిట్‌ను కరోనావైరస్ వెంటాడింది. షూటింగులోని మొత్తం ఏడుగురు సభ్యులకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దాంతో శరవేగంగా జరుగుతున్న షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. షూటింగును నిరవధికంగా వాయిదా వేసినట్టు తెలిసింది. ప్రస్తుతం కరోనా బారిన పడిన ఏడుగురిని హాస్పిటల్‌లో చేర్పించి వైద్య చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.
అన్నాతే షూటింగులో ఏడుగురికి కరోనావైరస్ సోకిందనే సమాచారంతో పలువురిని స్వీయ గృహనిర్బంధంలో ఉంచినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే రజనీకాంత్ స్వీయ గృహ నిర్బంధాన్ని పాటిస్తున్నట్టు సమాచారం. రజనీ కూడా కరోనా గుర్తింపు పరీక్షలు చేయించుకొన్నట్టు తెలిసింది.
అన్నాతే షూటింగులో కరోనా కలకలంతో యూనిట్ సభ్యుల్లో చాలా మందికి కరోనావైరస్ గుర్తింపు పరీక్షలు చేయించారని, రిపోర్టులు అందిన తర్వాత తీవ్రతను బట్టి షూటింగ్ నిర్వహణపై ఓ నిర్ణయాన్ని తీసుకొనే అవకాశం ఉందనే విషయాన్ని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
తమిళ సూపర్ స్టార్ అజిత్‌తో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం సినిమాలు రూపొందించిన సిరుతాయి శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. నయనతార, మీనా, కుష్బూ కీలక పాత్రలను పోషిస్తున్నారు.
Annaathe Unit suffrered with coronavirus positive, Rajinikanth in Self Quarantine. Apart from as per wiki, Annaatthe is Tamil-language action drama film written and directed by Siva. produced by Kalanithi Maran under the banner Sun Pictures. The film stars Rajinikanth, Meena, Khushbu, Keerthy Suresh, Nayanthara, Prakash Raj and Jackie Shroff.The music for the film will be composed by D. Imman while cinematography and editing are performed by Vetri and Ruben, respectively.