For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు

  |

  వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అతిథి రావు హైదరి హీరో హీరోయిన్లుగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అంతరిక్షం'. తెలుగులో రూపొందుతున్న తొలి స్పేస్ కాన్సెప్ట్ మూవీ ఇది. ఇందులో వరుణ్ తేజ్, అదితి రావు హైదరి వ్యోమగాముగా కనిపించబోతున్నారు.

  డిసెంబర్ 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి సాంగ్ 'సమయమా' నవంబర్ 30న సాయంత్రం 4 గంటలకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలను నిర్మించిన రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక విభిన్నమైన కాన్సెప్టుతో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా రూపొందిస్తున్నారు.

  ది ఎక్స్‌పెండబుల్స్ 2, ట్రాయ్, జీరో డార్క్ థర్టీ, హెర్క్యులెస్, ది ఇన్‌విజబుల్, లవింగ్ పాబ్లో, రీబార్న్, స్నిప్పెట్, మార్కో‌పోలో, గేమ్ అఫ్ థ్రోన్స్ వంటి హాలివుడ్ ప్రాజెక్టులకు పని చేసిన స్టంట్ మాస్టర్స్ జిబెక్, టోడోర్ లాజరవ్ (జూజి), రోమన్ ఈ చిత్రానికి పని చేశారంటే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

  Antarikshams Samayama song release on Oct 30th

  వరుణ్ తేజ్, అదితిరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, రాజా, అవసరాల శ్రీనివాస్, రెహ్మాన్ (రఘు) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి, కెమెరా: జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్స్: రామకృష్ణ సబ్బాని- మౌనిక నిగొత్రే సబ్బాని, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారీ, డైలాగ్స్: కిట్టు విస్సాప్రగడ, కాస్ట్యూమ్స్: అశ్వంత్ బైరి, స్టంట్స్: టోడోర్ లాజారోవ్, సి.జి: రాజీవ్ రాజశేఖరన్, ఎస్.ఎఫ్.ఎక్స్: మైష్ త్యాగి, దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి.

  English summary
  "Bringing you Samayama song from #Antariksham on the 30th of November. Stay tuned." Varun Tej tweeted.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X