సైలెంట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో.. అమ్మాయి ఎవరంటే?
గత ఏడాది కరోనా కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కరోనా లాక్డౌన్ లో కూడా అలాగే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలుగు హీరోయిన్ ప్రణీత సుభాష్, ఈరోజు యామి గౌతమ్ పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టగా నాటకం అనే సినిమాలో హీరోగా నటించి ప్రస్తుతం మరో మూడు సినిమాల్లో హీరోగా నటిస్తున్న ఆశిష్ గాంధీ వివాహం చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు.
హైదరాబాదుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిఖిత అనే యువతితో ఆయన ఏడు అడుగులు వేశారు. ఆదివారం నాడు ఆయన వివాహం అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య వైభవంగా జరిగినట్లు సమాచారం. ముందు వీరిద్దరూ ప్రేమించుకోగా ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగినట్లు సమాచారం. తన వివాహం గురించి ఆశిష్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో తనను చూసి నిఖిత ఇష్ట పడింది అని అప్పటి నుంచి ఎప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగిన ప్రతిసారీ గమనిస్తూ ఫాలో అవుతూ ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ విషయాలు నిఖిత నాతో చెబుతున్నప్పుడు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది అని చెప్పుకొచ్చిన ఆయన తాను కూడా ఆమెతో ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చారు. తాను కోరుకున్న లక్షణాలు ఉన్న అమ్మాయి నా జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్న ఆయన ముఖ్యంగా తను నా వ్యక్తితగతమైన విషయాలను బాగా అర్థం చేసుకుంటుందని అన్నారు.


Click it and Unblock the Notifications











