Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Ramesh Babu Death: రమేష్ బాబు మరణంతో ఆగిన ఈవెంట్.. కీలక ప్రకటన చేసిన యూనిట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా రోజులుగా వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ప్రాణాలను కోల్పోయారు. మరికొందరేమో పలు కారణాలతో మరణించారు. దీంతో రెండేళ్లుగా తరచూ ఇలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు, మహేశ్ బాబు సోదరుడు రమేష్ బాబు అరోగ్య సమస్యలతో శనివారం రాత్రి కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని అభిమానులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఒంటిపై నూలుపోగు లేకుండా ఇలియానా రచ్చ: ఇది మామూలు అరాచకం కాదుగా!
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు, నిర్మాత అయిన రమేష్ బాబు సుదీర్ఘ కాలం పాటు సినీ రంగానికి సేవలు అందించారు. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు కాలేయ సంబంధిత సమస్య వచ్చింది. ఈ కారణంగానే రమేష్ బాబు ప్రాణాలు కోల్పోయారు. ఇక, మరణంపై ఘట్టమనేని ఫ్యామిలీకి చెందిన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలుపుతున్నారు. దీంతో చనిపోయిన తర్వాత ఆయన పేరు ట్విట్టర్‌లో దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.

రమేష్ బాబు మరణంతో ఈరోజు జరగాల్సిన ఓ ఈవెంట్ కూడా రద్దైంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ కుమారుడు హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ఇప్పటికే ముమ్మరం చేసేసింది. ఈ క్రమంలోనే ఈరోజు తిరుపతిలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించి.. ట్రైలర్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.
షర్ట్ మొత్తం విప్పేసి అఖండ హీరోయిన్ రచ్చ: ఘాటు ఫోజులో అందాలన్నీ చూపిస్తూ అలా!
ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో రమేష్ బాబు మరణంతో అది కాస్తా క్యాన్సిల్ అయిపోయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాలో ఓ ప్రకటనను వదిలింది. అందులో 'రమేష్ బాబు గారి మరణ వార్తను విని షాక్‌కు గురయ్యాము. ఇది చాలా విచారకరం. ఘట్టమనేని కుటుంబ సభ్యులందరికీ, అభిమానులు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతిని, ప్రార్ధనలు తెలియజేస్తున్నాము. ఆయన మరణం కారణంగా ఈరోజు తిరుపతిలో జరిగే మా హీరో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నాము' అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా రూపొందిన చిత్రం 'హీరో'. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. శ్రీరామ్ ఆదిత్య ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి, సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు గిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.