Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్‌మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
NBK108: వైభవంగా మొదలైన బాలయ్య మూవీ.. గెస్టులుగా వచ్చింది ఎవరంటే!
దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలతో సందడి చేస్తూ టాప్ హీరోగా వెలుగొందుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న ఆయన.. గత ఏడాది వచ్చిన 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మరింత జోష్‌తో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో 'వీరసింహారెడ్డి' అనే సినిమాను చేస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన రాబోతుంది.
పాయల్ బాత్రూం పిక్స్ వైరల్: అది కూడా లేకుంటే అంతే సంగతులు!
'వీరసింహారెడ్డి' మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే నటసింహా నందమూరి బాలకృష్ణ.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. అంతేకాదు, కాస్టింగ్‌ను కూడా చాలా వరకూ కంప్లీట్ చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి గతంలో ఎన్నడూ టచ్ చేయని ఓ పవర్‌ఫుల్ పాయింట్‌తో కథను రెడీ చేసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా పూర్తి అయ్యాయి. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో దీన్ని అట్టహాసంగా పూర్తి చేశారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్‌తో పాటు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు హాజరయ్యారు. అలాగే, మరికొందరు దర్శక నిర్మాతలు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ అతి త్వరలోనే జరగబోతుందని తెలుస్తోంది.
యాంకర్ వర్షిణి ఎద అందాల జాతర: ఘోరంగా చూపిస్తూ ఇలా తెగించిందేంటి!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న ఈ సినిమాలో ప్రియాంక జావాల్కర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీలీలా ఆయన కూతురిగా నటిస్తుందని అంటున్నారు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో కావడంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.