Don't Miss!
- News
తెలంగాణాలో బీజేపీ దూకుడు; మళ్ళీ రంగంలోకి కేంద్ర మంత్రులు.. ఈసారి ప్లాన్ ఇదే!!
- Technology
Oppo కొత్త ఫోన్ల లాంచ్ డేట్ వచ్చేసింది ! ఈ ఫోన్ల ధర మరియు ఫీచర్లు చూడండి.
- Sports
Wimbledon 2022: సెమీస్‌లో ఓడిన సానియా జోడీ.. మ్యాచ్‌కు హాజరైన ధోనీ!
- Finance
Fuel Prices: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు: 100 డాలర్ల దిగువకు క్రూడ్
- Lifestyle
Today Rasi Phalalu :ఈ రోజు మీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయి, తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉందా?
- Automobiles
టీవీఎస్ నుంచి కొత్త బైక్ 'రోనిన్' వచ్చేసింది: ధర రూ. 1.49 లక్షలు
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు..!
NTR Jayanthi: నందమూరి ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్.. పోస్టర్ వదిలినా నిరాశే
తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్లను నిరూపించుకుని స్టార్‌గా ఎదిగారు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం బాలయ్య వరుస పరాజయాలతో సతమతం అవుతూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది చివర్లో 'అఖండ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది భారీ విజయాన్ని అందుకోవడంతో ఆయన మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. అదే సమయంలో కెరీర్‌లోనే భారీ కలెక్షన్లను కూడా ఖాతాలో వేసుకున్నారు.
హాట్ షోతో షాకిచ్చిన యాంకర్ స్రవంతి: ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందిన 'అఖండ' మూవీ ఇచ్చిన జోష్‌తో ఉన్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. రెట్టించిన ఉత్సాహంతో తన ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే గత ఏడాది రవితేజతో 'క్రాక్' అనే సినిమాతో సక్సెస్‌ను అందుకున్న గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. దీనికోసం గోపీచంద్ లైబ్రెరీలలో ఉన్న పాత సంఘటనలను కూడా ఆధారంగా తీసుకున్నాడు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ గురించి కూడా చాలా రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నో డేట్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ, బాలయ్య అఖండ షూటింగ్‌తో బిజీగా ఉండడంతో పాటు ఆయనకు సర్జరీ జరగడంతో ఈ మూవీ యూనిట్ మాత్రం షూటింగ్‌ను త్వరగా ప్రారంభించలేదు. దీంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం అయింది. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల పట్టణంలో దీన్ని మొదలు పెట్టి అప్పటి నుంచి పలు ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుతూ వస్తున్నారు.
బ్రా కూడా లేకుండా హీరోయిన్ ఫోజులు: ఎద అందాలు పూర్తిగా కనిపించేలా!

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి మే 28న స్పెషల్ సర్‌ప్రైజ్ రాబోతుందని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బాలయ్య ఉగ్రరూపంతో కనిపించారు. చేతిలో కత్తి పట్టుకున్న ఆయన వేటాడుతోన్న సింహంలా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ వరకూ ఫ్యాన్స్ సంతోషంగానే ఉన్నా.. ఈరోజు టైటిల్‌ను రివీల్ చేస్తారని వాళ్లు పెట్టుకున్న ఆశలు మాత్రం ఫలించలేదు. దీంతో అభిమానులు కాసింత నిరాశగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక, తాజాగా వచ్చిన పోస్టర్ మాత్రం తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది.
పవర్‌ఫుల్ సబ్జెక్టుతో రాబోతున్న నందమూరి బాలకృష్ణ సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. ఈ చిత్రానికి 'జై బాలయ్య' అనే టైటిల్ పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే.