For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలయ్య కెరీర్‌లోనే ఫస్ట్‌టైమ్ ఆ ఫీట్.. అక్కడ రికార్డు ధరకు రూలర్.. ఫ్యాన్స్‌లో టెన్షన్

  |

  నందమూరి నటసింహం బాలకృష్ణ.. వెండితెరపై తనదైన శైలిలో విజ‌ృంభించిక దాదాపు రెండేళ్లు అవుతుంది. ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో బాలకృష్ణ నటించినా.. అవి ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్‌కు, ఫ్యాన్స్‌కు ఊపు వచ్చే చిత్రాలు కావవి. చివరగా జై సింహా అంటూ వచ్చి శత్రువులను ఊచకోత కోశాడు. అలా తెరపై శత్రువులను నరికి అవతల పారేస్తూ, తనదైన శైలిలో డైలాగ్స్ చెబుతూ ఉంటే.. నందమూరి అభిమానులకు పూనకాలు రావాల్సిందే. అలా తన ఫ్యాన్స్‌‌ను అలరించేందుకు సిద్దమయ్యాడు.

  కమర్షియల్ హిట్ కొట్టిన జైసింహా..

  కమర్షియల్ హిట్ కొట్టిన జైసింహా..

  కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన జైసింహా భారీ హిట్టు కొట్టింది. కథ పాతదే అయినా.. బాలయ్య స్టైల్ డైలాగ్స్, మాస్ ఎలిమెంట్స్, హీరోయిజం ఎలివేషన్ లాంటి సీన్లతో సినిమాను నెట్టుకొచ్చాడు. అదే నందమూరి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. తమ హీరో తెరపై శత్రువులను చీల్చి చెండాడుతూ ఉంటే.. బాక్సాఫీస్‌ను కాసులతో నింపేస్తారు.

  విజృంభించే రూలర్..

  విజృంభించే రూలర్..

  నందమూరి అభిమానులకు జైసింహాతో మంచి హిట్ ఇచ్చిన కేఎస్ రవికుమార్.. రూలర్‌తో మరో విజయాన్ని అందించేందుకు సిద్దమయ్యాడు. ఫ్యాన్స్ పల్స్ తెలుసుకున్న దర్శకుడు మళ్లీ అలాంటి అంశాలతో కూడిన కథను సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ఈ చిత్రంలో బాలయ్య లుక్ రివీల్ కావడంతోనే అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన లుక్ ఈ సినిమాకు కలిసొచ్చేలా ఉందని ఫ్యాన్స్ ముచ్చటించుకున్నారు.

  పోస్టర్‌లతో సెన్సేషన్..

  పోస్టర్‌లతో సెన్సేషన్..

  దసరా కానుకగా, దీపావళి కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్స్ ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. శత్రువల రక్తంతో తడిసిపోయిన కత్తి పట్టుకున్న బాలయ్య, లాఠీ పట్టుకుని ఊగిపోతున్న పోస్టర్స్ ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయగా.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన రొమాంటిక్ పోస్టర్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ అందర్నీ షాక్‌కు గురిచేస్తోంది.

  సీడెడ్‌లో రికార్డు ధరకు..

  సీడెడ్‌లో రికార్డు ధరకు..

  ఈ చిత్రాన్ని సీడెడ్‌లో భారీ ధరకు అమ్మినట్టు తెలుస్తోంది. దాదాపు 5.5కోట్లకు ఈ మూవీ హక్కులను అమ్మినట్లు టాక్. బాలయ్య కెరీర్‌లో ఆ ఏరియాలో ఇంత భారీ మొత్తంలో అమ్మిన చిత్రంగా రూలర్ నిలిచిపోయింది. అయితే ఈ చిత్రం ఆ రేట్ పలకడంలో ఫ్యాన్స్ సంతోషంగానే ఉన్నా.. బ్రేక్ ఈవెన్ అవుతుందా అన్న టెన్షన్‌లో పడిపోయారు.

  Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
  బ్రేక్ ఈవెన్ సాధించని పెద్ద చిత్రాలు..

  బ్రేక్ ఈవెన్ సాధించని పెద్ద చిత్రాలు..

  దేశ వ్యాప్తంగా ఎంతో బజ్ క్రియేట్ చేసిన ప్రభాస్ సాహో చిత్రం, సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్‌ను సాధించలేకపోయాయి. అలానే రూలర్ కూడా అవుతుందా? అని ఇప్పుడే ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే జైసింహా అక్కడ దాదాపు 5 కోట్ల వసూళ్లను రాబట్టింది. కాబట్టి ఈ చిత్రం కూడా అదే రేంజ్‌లో వర్కౌట్ అవుతుందని మరికొంత మంది అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఇంకొన్ని రోజులు ఆగితే అన్ని విషయాలు తెలిసిపోతాయి. సోనాల్ చౌహాన్, వేధిక, ప్రకాశ్ రాజ్, భూమిక లాంటి తారగణం నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది.

  English summary
  Nandamuri Balakrishna New Poster From Ruler Goes Viral. This Movie Is Directed By KS Ravikumar And Produced By C Kalyan. Bhumika, Prakash Raj, Sonal Chauhan Are Playing Important Character. here is a big update on Ruler. According to reports, its Ceeded rights have been sold for Rs 5.5 crore, a career-best for Balakrishna.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X